వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వే ఎఫెక్ట్: టిఆర్ఎస్‌కు ఇలా చెక్, కెసిఆర్‌కు దెబ్బేనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను నిలువరించేందుకు అన్ని అవకాశాల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే వ్యూహ రచన చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇటీవల నిర్వహించిన సర్వే ఆధారంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు విపక్షాలతో మహకూటమిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు విపక్షాలతో సంప్రదింపులను ప్రారంభించారు.

2019 ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కుంచుకోవాలంటే విపక్షాలన్నీ మూకుమ్మడిగా పోటీ చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. విపక్షాలు విడిగా పోటీ చేయడం వల్ల టిఆర్ఎస్ కు ప్రయోజనం కలుగుతోందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

టిఆర్ఎస్‌ను దెబ్బకొట్టాలంటే విపక్షాలు మూకుమ్మడిగా పోటీ చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో అవలంభించిన పద్దతులను అనుసరిస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని కాంగ్రెస్ నేతలు విశ్వసిస్తున్నారు.

మహకూటమిపై కాంగ్రెస్ ప్రయత్నాలు

మహకూటమిపై కాంగ్రెస్ ప్రయత్నాలు

ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రైవేట్ సర్వే సంస్థలతో నిర్వహించిన సర్వేలో ఫలితాల ఆధారంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకుగాను కూటమిని ఏర్పాటు చేయాలనే అభిప్రాయంతో ఉన్నారు. ఉత్తర తెలంగాణలో టిఆర్ఎస్‌‌కు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే పుంజుకొనే అవకాశాలున్నాయని తేలింది. టిఆర్ఎస్‌ను ఎదుర్కోవాలంటే విపక్షాలన్నీ కూటమిగా పోటీ చేస్తే ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

కాంగ్రెస్‌ పొత్తుపై పార్టీల అభిప్రాయాలివే

కాంగ్రెస్‌ పొత్తుపై పార్టీల అభిప్రాయాలివే

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయమై సిపిఐ నేతలు సానుకూలంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. సిపిఐ నేతలతో కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ విషయమై చర్చించారని సమాచారం. అయితే సుమారు 6 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని సిపిఐ నేతలు కోరుతున్నారని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిపిఐ నేతలు సానుకూలంగా స్పందించే అవకాశాలు కూడ లేకపోలేదని కాంగ్రెస్ వర్గాల్లో అభిప్రాయం నెలకొంది. బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ ఏర్పాటు చేసిన సిపిఎం కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసే అవకాశాలు కన్పించడం లేదు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసేందుకు టిడిపి నేతలు కూడ కొందరు సానుకూల సంకేతాలను పంపుతున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. ఎన్నికల సమయంలోనే పొత్తుల విషయమై మాట్లాడుదామని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు టిడిపి నేతలకు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలిచ్చారు.

బిజెపిని కూటమిలో కలుపుకొంటారా

బిజెపిని కూటమిలో కలుపుకొంటారా


దేశంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని బిజెపి ఇప్పటికే ప్రకటించింది. కానీ, తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యలో బిజెపిని కూడ కూటమిలో కలుపుకొంటే ప్రయోజనం ఉండే అవకాశం లేకపోలేదనే చర్చ కూడ సాగుతోంది. అయితే ఇదే జరిగితే రాజకీయంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే చర్చ కూడ ఉంది.ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఆచితూచి అడుగేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది.

కోదండరామ్‌తో కాంగ్రెస్ చర్చలు

కోదండరామ్‌తో కాంగ్రెస్ చర్చలు

వచ్చే ఎన్నికల్లో కోదండరామ్‌ను కూడ కలుపుకుపోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు కోదండరామ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నాటికి కోదండరామ్ పార్టీని ఏర్పాటు చేస్తే ఆ పార్టీతో సర్ధుబాటు చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారనే ప్రచారం కూడ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.

English summary
Congress is making all efforts to wipe out TRS from the power in 2019 general elections. The party is making all plans to form as Mahakutami with left parties, TDP and TJAC. It is also learned that they are planning to wait for some time. The grand old party leaders are hoping that the decision will come from the other party leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X