Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం - కీలక పరిణామం..!!

ఏపీలో మహిళలకు ఉచిత బస్పు ప్రయాణం పై కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం అన్ని కోణాల్లొనూ ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. తెలంగాణలో అమలవుతున్న ఈ పథకం పండుగ వేళ ఏపీఎస్ఆర్టీసికి కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీకి అనూహ్యంగా పెరిగిన ఆదాయంతో ఏపీలో ఉచిత బస్పు ప్రయాణం పైన నిర్ణయం పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో, అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది.

మహిళలకు ఉచిత ప్రయాణం: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెల రోజులగా ఈ పథకం అమలవుతోంది. ఈ నెల రోజుల సమయంలో మహిళల నుంచి భారీ ఎత్తున ఈ పధకం పైన ఆదరణ కనిపిస్తోంది.

Mahalaxmi Scheme in Telangana gives Revenue for APSRTC amid Pongal Rush

దీంతో, ఏపీలోనూ ఈ పథకం అమలు పైన సాధ్యాసాధ్యాలు పరిశీలన కోసం అధికారులు కసరత్తు చేసారు. తెలంగాణ ఆర్టీసీ అధికారులతోనూ సమావేశాలు నిర్వహించారు. ఆర్దిక భారంతో పాటుగా ఆటో కార్మికుల్లో వస్తున్న నిరసన, సానుకూల - ప్రతికూల అంశాల పైన అధ్యయనం చేసి ఒక నివేదిక సమర్పించారు. దీని పైన ప్రభుత్వం మరింత లోతుగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఏపీ ప్రభుత్వం అధ్యయనం: ఇక, ఇప్పుడు సంక్రాంతి వేళ తెలంగాణలో మహాలక్ష్మి పథకం ఏపీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు పెంచుతుంది. ఈ ఏడాది పండగ సీజన్‌ మొత్తం 6,795 బస్సులు నడుపుతున్న ఏపీఎ్‌సఆర్టీసీ.. హైదరాబాద్‌కు 1600సర్వీసులు(గత ఏడాది 1500) తిప్పబోతోంది.

ఇదే స్థాయిలో తెలంగాణ ఆర్టీసీ కూడా మన రాష్ట్రంలోకి ప్రత్యేక బస్సులు పంపుతుంది. అయితే అనూహ్యంగా ఏపీ బస్సుల్లో సీట్లన్నీ ముందస్తు రిజర్వేషన్లు అయిపోతున్నాయి. తెలంగాణలో మహాలక్ష్మి(మహిళలకు ఉచిత ప్రయాణం) పథకం అమలుతో హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌ తదితర ప్రాంతాలకు రద్దీ ఎక్కువైంది.

పండుగ వేళ కాసుల వర్షం: తెలంగాణ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కావటంతో రద్దీకి అనుగుణంగా కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. దీంతో, ఏపీకి ప్రత్యేక బస్సులు ఏర్పాటుకు అవకాశం దక్కటం లేదు. మరో వైపు రైళ్లు ఫుల్ కావటంతో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు అదనంగా మరో 1400బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లాల మధ్య తిరిగే సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌ బస్సుల్లో కండీషన్‌ ఉన్నవాటిని హైదరాబాద్‌కు మళ్లించారు.

ఒకే సారి మూడు వేల బస్సులు అందుబాటులోకి రావడంతో మన రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు ఇబ్బంది లేకుండా రిజర్వేషన్లు చేసుకొంటున్నారు. రద్దీ మార్గాల్లో మరిన్ని బస్సులు నడిపేందుకు సిద్దమైంది. ఫలితంగా తెలంగాణలో మహాలక్ష్మి పథకం సంక్రాంతి వేళ ఏపీఎస్ఆర్టీసీకి ధనలక్ష్మిగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+