ఎన్నో అటుపోట్లు - ఏదైనా సాధ్యమే : సీఎం కేసీఆర్..!!
అయిదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. రైతుల శక్తి ఏంటో చూశామని, రైతు సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందని వివరించారు. తెలంగాణలో ఏం చేశామో ఒకసారి చూడాలని..కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మహారాష్ట్రకు చెందిన శరత్ జోషితో పాటు కొందరు రైతు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 14 మంది ప్రధానులు మారినా దేశ ప్రజల తలరాత మాత్రం మారలేదని కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పడక ముందు రైతులు, చేనేతలు ఆత్మహత్యలు చేసుకునేవారు అని కేసీఆర్ గుర్తు చేశారు. వ్యవసాయాన్ని సుస్థిరం చేశాక రైతుల ఆత్మహత్యలు ఆగాయని చెప్పారు. రైతుల గోస చూసి తనకు కన్నీళ్లు వచ్చేవన్నారు. దేశంలో 94 లక్షల ఎకరాల్లో వరి పండుతుదన్నారు. అందులో 56 లక్షల ఎకరాల వరి తెలంగాణలోనే పండుతుందని వివరించారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందన్న ఆయన.. మన ఆలోచనల్లో, ఆచరణల్లో నిజాయితీ ఉండాలని, గెలవాలంటే చిత్తశుద్ధి ఉండాలని పిలుపునిచ్చారు. రైతుల పోరాటం న్యాయబద్దమైందని, తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని స్పష్టం చేశారు.

ఉత్తర్ ప్రదేశ్,పంజాబ్ ఎన్నికలు ఉండకపోతే కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకునేది కాదని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.రైతుల పోరాటంపై ప్రధాని మోడీ కనీసం సానుభూతి చూపించలేదని విమర్శించారు.ఆ సమయంలో రైతుల గోస చూసి తనకు కన్నీళ్లు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 750రైతులు చనిపోతే మోడీ స్పందించలేదని, రైతులను ఖలీస్థానీలు, ఉగ్రవాదులు అని అన్నారని గుర్తు చేశారు. మన దేశంలో దేనికి కొదవ లేదు. అయినప్పటికీ రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అని కేసీఆర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications