షాకింగ్ ట్విస్ట్: కేసు వెనక్కి, పవన్ ఫ్యాన్స్‌తో రెస్టారెంట్‌లో కత్తి? అభిమానులకు హామీ!
Recommended Video

హైదరాబాద్: మహేష్ కత్తిపై కోడి గుడ్లతో దాడి చేసిన కేసులో కొత్త ట్విస్ట్. గురువారం జరిగిన ఈ సంఘటనపై మహేష్ కత్తి శుక్రవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనపై దాడికి పాల్పడింది పవన్ ఫ్యాన్సే అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
చదవండి: చిరంజీవికి అలా చెప్పి ఎక్కడ దాక్కున్నావ్: రేణుని లాగి పవన్‌పై మహేష్ కత్తి, దుమ్ముదులిపిన రాంకీ
ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 24 గంటలు గడవక ముందే సీసీ ఫుటేజీ ద్వారా కీలక ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత ఉన్నట్లుండి మహేష్ కత్తి కేసును ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు, ఈ దాడికి పాల్పడింది తామేనని ఇద్దరు ఓ టీవీ స్టూడియో ముందుకు వచ్చారు.
చదవండి: పోర్న్‌స్టార్‌కే: పూనమ్ కౌర్ మళ్లీ సంచలన ట్వీట్, మహేష్ కత్తికి దిమ్మతిరిగే షాక్!

కేసును ఎందుకు ఉపసంహరించుకున్నారు
కేసును ఉపసంహరించుకున్న నేపథ్యంలో.. మహేష్ కత్తి కేసును ఎందుకు ఉపసంహరించుకున్నారు, ఎవరైనా ఒత్తిడి తెచ్చారా లేక చాలామంది అనుమానిస్తున్నట్లు ఈ దాడి వెనుక ప్లాన్ ఉందా? అందుకే ఉపసంహరించుకున్నారా అనే చర్చ సాగుతోంది. ఈ దాడికి పాల్పడింది పవన్ ఫ్యాన్స్ కాదనే వాదనలు కూడా వినిపించాయి. మొత్తానికి ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది.

ఉపసంహరణ వెనుక మరో వాదన
కేసు ఉపసంహరణ వెనుక మరో వాదన కూడా వినిపిస్తోంది. ఈ మేరకు మీడియాలో ప్రచారం సాగుతోంది. జనసేన కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో కేసును ఉపసంహరించుకున్నారని ప్రచారం సాగుతోంది. దీంతో పవన్ అభిమానులు, కత్తి మహేష్ కలిసి ఫిలిం నగర్‌లో ఓ రెస్టారెంటులో పార్టీ చేసుకున్నారని తెలుస్తోందని పేర్కొంటున్నారు.

పవన్ అభిమానులకు మాటిచ్చిన మహేష్ కత్తి
ఈ భేటీ సందర్భంగా మహేష్ కత్తి.. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ మాట కూడా ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. అలాగే వారికి సూచన కూడా చేశారు. అభిమానులు.. పవన్ అభిమానుల్లా కాకుండా, జనసేన కార్యకర్తలుగా పని చేయాలని, ఇకపై పవన్ అభిమానులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా తాను సంయమనం పాటిస్తానని చెప్పారని అంటున్నారు.

అందరినీ ఆకట్టుకునేలా
ఇదిలా ఉండగా, అంతకుముందు మహేష్ కత్తి ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో పాల్గొన్నారు. జనసేన పార్టీ నుంచి లేఖ వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ సారీ చెప్పాల్సిందేనని మహేష్ కత్తి పట్టుబట్టారు. ఈ సందర్భంగా వసంధర అనే యువతి మాట్లాడారు. ఆమె మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

అభిమానులు కూడా అలా
పవన్ అభిమానులకు సూచనలు ఇచ్చారు. తాను కూడా పవన్ కల్యాణ్‌కి అభిమానే అని, అయితే ఓ మనిషి బురద జల్లితే, అభిమానించే వారిగా ఆ బురదను శుభ్రం చేయాల్సిన బాధ్యత అభిమానులదని, కానీ అందుకు భిన్నంగా జరుగుతోందని, ఆ బురదనే పూసుకుని అభిమానులు కూడా పొర్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని ఇంతటితో ఆపేసి బయట ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిపై పోరాడాలన్నారు.
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications