దిల్ రాజుపై మహేష్‌బాబు ఆగ్రహం? F3నే కారణమా??
ప్రముఖ నిర్మాత దిల్‌రాజుపై ప్రిన్స్ మహేష్‌బాబు ఆగ్రహంగా ఉన్నట్లు ఫిల్మ్‌నగర్‌లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. F3 సినిమాకు తక్కువ ధరలంటూ చేసిన ప్రచారం సర్కారువారిపాట సినిమా వసూళ్లను దెబ్బతీసిందని భావిస్తున్నారు. ఈ విషయాన్ని కొందరు డిస్ట్రిబ్యూటర్లు మహేష్‌బాబుతో కలిసి విశ్లేషణ చేశారు. వాస్తవానికి సర్కారువారిపాట నైజం డిస్ట్రిబ్యూటర్ కూడా దిల్ రాజే.

సర్కారువారిపాట కలెక్షన్లను దెబ్బతీసిన F3 ప్రచారం
సర్కారు వారి పాట విడుదలైన రెండు వారాలకు F3 సినిమాను దిల్ రాజు విడుదల చేశారు. F3కి ముందువరకు ప్రభుత్వంతో మాట్లాడుకొని టికెట్ ధరలు ఎక్కువ ఉండేలా చూసుకొని సినిమాలు విడుదల చేయడం దిల్ రాజుతోనే ప్రారంభమైంది. అయితే F3 విడుదల సమయంలో 10 రోజుల మందుగానే ధియేటర్లో తక్కువ ధరలంటూ ప్రచారం ప్రారంభించారు. సర్కారువారిపాట సినిమా థియేటర్లలో రన్ అవుతున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన ఈ ప్రచారం ఆ సినిమా కలెక్షన్లను దెబ్బతీసింది. ధియేటర్ లో తక్కువ ధరలు, అలాగే F3 కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా కావడంతో మధ్యతరగతి ప్రజలంతా F3వైపు చూశారనే అభిప్రాయాన్ని కొందరు మహేష్‌బాబుతో పంచుకున్నారు.

నైజంలో సర్కారువారిపాట బ్రేక్ ఈవెన్?
సర్కారువారిపాట సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించి దిల్ రాజు ఆ సినిమా నిర్మాతలకు రూ.29 కోట్ల నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్ ఇచ్చారు. జిఎస్టీని మైత్రీ మూవీస్ అందించింది. ఈ రెండు కారణాలవల్ల F3 విడుదలయ్యే సమాయానికి నైజాంలో సర్కారువారిపాట దాదాపుగా బ్రేక్ ఈవెన్‌కు వచ్చేసింది.

తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు తగ్గించాల్సి వచ్చింది
నైజాంకు సంబంధించి సర్కారువారిపాట రూ.28 కోట్ల దగ్గర ఆగిపోయిందని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. F3 సినిమాకు సంబంధించి తక్కువ ధరలు ఉండటంతో మిగతా సినిమాలవారు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తగ్గించాల్సి వచ్చింది. మహేష్‌బాబు నిర్మించిన మేజర్ సినిమాకు కూడా థియేటర్ టికెట్ ధరలు భారీగా తగ్గించారు. F3 కన్నా తక్కువ ధరలు పెట్టారు.

మహేష్-త్రివిక్రమ్ రైట్స్ దిల్‌రాజుకు ఇస్తారా?
పై కారణాలకు సంబంధించి మహేష్‌బాబు దిల్ రాజుపై ఆగ్రహంగా ఉన్నారనే వార్త తెలుగు చలనచిత్ర పరిశ్రమలో షికారు చేస్తోంది. మహేష్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది దిల్ రాజే. అయితే ఈ వార్తలు నిజమైతే ఆయనకే నైజాం హక్కులు ఇస్తారా? లేదంటే వేరేవారికి ఇస్తారా? అన్నది వేచిచూడాలి..!!












Click it and Unblock the Notifications