హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లోనే 30 మంది, ఆస్పత్రికి 14 మంది !
హైదరాబాద్ లోని మీర్ చౌక్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గుల్జార్‌హౌస్ సమీపంలోని ఓ భవనంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా 14 మందిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాద బాధితుల్ని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు ముమ్మరం చేశారు. మరో 30 మందికిపైగా భవనంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చార్మినార్ కు వెళ్లే ప్రధాన రహదారులన్నీ మూసేశారు. ఫైర్ సిబ్బంది 10 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు నేడు మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ప్రపంచ సుందరీమణులు ఇవాళ సాయంత్రం సెక్రటేరియట్ ను సందర్శించనున్నారు. దీంతో సెక్రటేరియట్ వద్ద అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ట్యాంక్ బండ్ మీద సండే-ఫండే ఈవెంట్ కు అంతా సిద్ధం చేశారు. ఇక మిస్ వరల్డ్ లకు సంబంధించి డ్రోన్ షో సైతం ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 3గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ట్యాంకుబండ్ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.

ఈ క్రమంలోనే భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వాణిజ్య భవనంగా ఉండటంతో అక్కడ భారీగా స్టాక్ చేసిన వస్తువులు మంటలకు ఆహుతయ్యే అవకాశం ఉంది. మంటల్లో చిక్కుకున్న వారిని బయటికి తెచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. అంతస్తుల మధ్య చేరలేని స్థితిలో చిక్కుకున్నవారిని క్రేన్లు, ల్యాడర్లు, హైడ్రాలిక్ ఎక్విప్మెంట్‌లతో రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications