Hyderabad: మినర్వా హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని మినర్వా హోటల్‌లో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కిచెన్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో హోటల్ సిబ్బంది, కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో నారాయణగూడ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాద ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే, పెద్ద మొత్తంలోనే ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు, రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ రైల్వే స్టేషన్ వద్ద లారీ పార్కింగ్‌లో షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగడంతో మెకానిక్ షెడ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. రూ. 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Fire broke out at minerva kitchen in Himayatnagar branch in Hyderabad on Sunday evening. @hydcitypolice @HiHyderabad @AmitLeliSlayer @Hariprem80 @Vinaymadapu @TelanganaDGP pic.twitter.com/wjQGVq9Jx5
— R V K Rao_TNIE (@RVKRao2) January 5, 2025
లారీ ఢీకొని ముగ్గురు మృతి
మేడ్చల్ చెక్ పోస్టు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దంపతులు, వారి కుమార్తె ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. కుమారుడికి తీవ్ర గాయాలయయాయి. ఏపీలోని కాకినాడకు చెందిన సాగి బుల్లబ్బాయి కుటుంబం హైదరాబాద్ ఉప్పల్‌లో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తోంది.
కాగా, మేడ్చల్ ఎల్లంపేటలోని బంధువులను చూసేందుకు బైక్‌పై వెళుతుండగా వెనుక నుంచి నాగాలాండ్‌కు చెందిన కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సాగి బుల్లబ్బాయి (37), లావణ్య (32), హర్షితాదేవి (8) ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆరేళ్ల బాలుడు సిద్ధేశ్వర్ తీవ్ర గాయాపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడం, ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications