సీబీఐ మాజీ జేడీ ఇంట్లో భారీ చోరీ: పనిచేసే వారిపైనే అనుమానం
సీనియర్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో శనివారం భారీ చోరీ జరిగింది. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న ఆయన ఇంట్లో భారీగా బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు కుటుంబసభ్యుల
హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో శనివారం భారీ చోరీ జరిగింది. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న ఆయన ఇంట్లో భారీగా బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు కుటుంబసభ్యులు గుర్తించారు.
ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులకు లక్ష్మీనారాయణ సమాచారం అందించారు. లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులు ఇంట్లో పనిచేసే వారిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇటీవల ప్రముఖ సినీనటుడు, ఎంపీ చిరంజీవి ఇంట్లో కూడా దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో కూడా చిరంజీవి ఇంట్లో పనిచేసే వ్యక్తే ఈ చోరీకి పాల్పడటం గమనార్హం.












Click it and Unblock the Notifications