Eatala Rajender: సీఎం పదవి ప్రజలిచ్చిన పదవి.. ఈటల ఘాటు వ్యాఖ్యలు..

బీజేపీ సీనియర్ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి సొంత అజెండాతో పని చేయవద్దని చెప్పారు. పనుల నిమిత్తం ముఖ్యమంత్రిని కలిస్తే దానికి చెడు ఉద్దేశాలు అపాదించవద్దున్నారు. పనుల నిమిత్తం ఏ రాజకీయ పార్టీ నేతలైనా సీఎంను కలిసే సంప్రదాయం ఉండాలన్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఆదివారం జరిగిన కృతజ్ఞతా సభలో ఈటలను సన్మానం చేశారు.

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి పని చేయాలని ఈ సందర్భంగా ఈటల అన్నారు. తాను అసెంబ్లీలో ప్రజల సమస్యలపై నిత్యం కొట్లాడేవాటిని గుర్తు చేశారు. తాను నలుగురు ముఖ్యమంత్రులతో ప్రజా సమస్యలపై పోరాటం చేసినట్లు పేర్కొన్నారు. సభలో కొట్లాడాక ఆ వెంటనే దరఖాస్తు పట్టుకుని ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లేవాడిని గుర్తు చేశారు. తనను చూసిన సీఎంలు ఇప్పటి వరకు సభ జరగనివ్వని నేకెందుకు నిధులు ఇవ్వాలని ప్రశ్నించేవారని గుర్తు చేశారు.

Malkajigiri MP Etala Rajender criticized CM Revanth

కానీ ముఖ్యమంత్రి పదవి అంటే పార్టీ కాదని.. అది ప్రజలు ఇచ్చిన పదవి అని ఈటల స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ప్రజలు పట్టుబట్టి మరీ తనను గెలిపించుకున్నారని తెలిపారు. ఈ విజయం మల్కాజిగిరి ప్రజలకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులను ప్రజల సమస్యల పరిష్కారం కోసం వినియోగిస్తామన్నారు. ఏ సమస్యకైనా నో అనేది నా డిక్షనరీలోనే లేదన్నారు.

ప్రతి సమస్యకు ఎక్కడో ఓ చోట పరిష్కార మార్గం ఉంటుందన్నారు. సభ తర్వాత ఈటల రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. రామోజీ రావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం రామోజీ రావు కుటుంబ సభ్యులను పలకరించి ధైర్యం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+