వైరల్ వీడియో: జూబ్లీహిల్స్ లో మల్లారెడ్డి సందడి.. కటింగ్ చేస్తూ.. పాపను ఎత్తుకుని..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఇటీవల ఎన్నికల కమిషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 11 న పోలింగ్ నిర్వహిస్తారు. దీంతో నెల రోజుల ముందు నుంచే ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచార పర్వం మొదలు పెట్టాయి. జూబ్లీహిల్స్ బరిలో బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీత బరిలో ఉన్నారు. ఇక అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పేరును ఇదివరకే పార్టీ హై కమాండ్ ప్రకటించింది. ఇవాళో రేపో బీజేపీ అభ్యర్థిని కూడా ప్రకటిస్తారు. దీంతో జూబ్లీహిల్స్ లో నెల రోజుల ముందు నుంచే ఎన్నికల సందడి మొదలైంది.
ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వినూత్న ప్రచారం నిర్వహించారు. బస్తీలోని గల్లీ గల్లీ తిరుగుతూ ఓట్లు అడిగారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని.. కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ప్రచారంలో ఆయన చేసిన సందడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. చాయ్ దుకాణంలో మల్లారెడ్డితోపాటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. అక్కడి ఓటర్లకు టీ అందించారు. కాలనీలు మొత్తం కలియతిరిగారు. ఒక సెలూన్ లో హెయిర్ కట్ చేస్తూ ఓటు అభ్యర్థించారు. మరోసారి ఓ ఇంటి ముందు పాపను ఎత్తుకుని డ్యాన్స్ చేశారు. ఇలా మల్లారెడ్డి ప్రచారం సరదాగా సాగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు గ్యారంటీ కార్డును మల్లారెడ్డి అందించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చిన్న బాబుతో డాన్స్ చేసిన మల్లారెడ్డి..!!#CHMallaReddy #MallaReddy #BRS #Congress #MagantiSunitha #NaveenYadav #JubileeHillsByPoll #JubileeHillsByElection #PoliticsToday #Oneindiatelugu pic.twitter.com/yGfkDaxPaN
— oneindiatelugu (@oneindiatelugu) October 14, 2025
ఇటీవల కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన గ్యారెంటీ కార్డుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డును విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాకీ కార్డును మల్లారెడ్డి ఓటర్లకు అందించారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చడం లేదని ఆరోపించారు. ఈ మేరకు 'కారు గుర్తుకే మన ఓటు, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.. మాగంటి సునీత నాయకత్వం వర్ధిల్లాలి' అంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.

ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 13న ఎలక్షన్ కమిషన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం.. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22 న జరుగనుంది. అభ్యర్థిత్వం ఉపసంహరణకు చివరి తేదీగా అక్టోబర్ 24గా నిర్ణయించారు. ఇక పోలింగ్ నవంబర్ 11న ఉంటుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు నవంబర్ 14 న జరగనుంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications