న్యూడ్ ఫొటోలో బ్లాక్‌మెయిల్ జల్సా: ఐదు పెళ్లిళ్లు
హైదరాబాద్: ప్రేమ పేరుతో అమ్మాయిలకు వల వేసి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి జల్సా చేసిన తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తున్నకామాంధుడిని సికింద్రాబాదులోని తుకారాంగేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య ఫిర్యాదుతో చివరికి అతను కటకటాల పాలయ్యాడు.
ప్రేమ పేరుతో అమ్మాయిలకు వల వేసి, పెళ్లి పేరుతో వారిని శ్రీకాంత్ లొంగతీసుకుంటాడు. అమ్మాయిలతో జల్సా చేస్తూ ఆ దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరిస్తాడు. ఆ తర్వాత వారిని బ్లాక్ మొయిల్ చేస్తాడు. అంతేకాకుండా తాను జల్సా చేస్తున్న దృశ్యాలను, అమ్మాయిల నగ్న ఫొటోలను భార్యకు కూడా చూపించి వేధించేవాడు.

అతడి ఆగడాలను భరించలేక భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు శ్రీకాంత్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అతను 5 పెళ్లిళ్లు చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. భర్త సెల్‌ఫోన్‌లో అసభ్య చిత్రాలు చూసి రెండో భార్య ఆగ్రహించింది.
నిత్య పెళ్లికొడుకు ఉన్మాద చేష్టలపై రెండో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications