హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు బెదిరింపు మెయిల్స్: ఐటీ ఉద్యోగి అరెస్ట్
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పదే పదే బెదిరింపు మెయిల్స్ పంపుతున్న నిందితుడిని ఎయిర్‌పోర్ట్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడిని కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు చెందిన వైభవ్ తివారీగా గుర్తించారు. కాగా, కోవిడ్ కారణంగా ఐటీ ఉద్యోగం పోయి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్స్ పంపుతున్నాడు. గతంలో రెండుసార్లు విమానాల్లో హైజాకర్లు వచ్చారని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు మెయిల్స్ పంపాడు నిందితుడు. ఆ మెయిల్స్ కారణంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు.

ఆ మెయిల్‌ను పరిశీలించగా ఇంటర్నేషనల్ డిపార్చర్ గేట్లు తెరవద్దని అందులో బాంబు పెట్టామని ఉంది. ఈ క్రమంలో విమానాశ్రయం సిబ్బంది ఆర్టీఐఏ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్షుణ్ణంగా తనిఖీలు చేసి బాంబు లేదని నిర్ధారించారు.
ఆ మెయిల్స్ అన్నీ నకిలీవని తేలడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. బెంగళూరులో వైభవ్‌ను అరెస్ట్ చేశారు. కాగా, పలుమార్లు శంషాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు కాల్స్ వచ్చని విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications