హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గోనెసంచుల్లో కోట్లాది రూపాయలు: బస్టాండులో చిక్కిన వ్యాపారి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ రింగ్ రోడ్డువద్ద అర్ధరాత్రి వేళ గోనెసంచుల్లో భారీమొత్తం డబ్బు తీసుకెళ్తున్న వ్యక్తిని స్పెషల్ ఆపరేషన్ బృందం (ఎస్‌వోటీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి సుమారు రూ. 1.45 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారణ తర్వాత నిందితుడితోపాటు సొమ్మును ఆదాయం పన్ను (ఐటీ)శాఖ అధికారులకు స్వాధీనం చేశారు.

ఎల్బీనగర్ సీఐ కాశిరెడ్డి అందుకు సంబంధించిన వివరాలను అందించారు. నెల్లూరు వాసి దొంతంశెట్టి ప్రసాద్ (48) ప్రతివారం చివరిలో హైదరాబాద్‌కు వచ్చి నెల్లూరు నుంచి బియ్యం కొనుగోలు చేసిన వ్యక్తుల వద్ద డబ్బులు వసూలు చేసుకుని వెళ్తుంటాడు.

నెల్లూరులోని 14 మంది రైస్‌మిల్లర్లకు చెందిన రూ. 1,44,62, 810లను హైదరాబాద్‌లోని వ్యాపారుల నుంచి వసూలు చేసుకుని శనివారం రాత్రి రెండుగంటల సమయంలో బస్సు కోసం ఎల్బీనగర్ రింగ్‌రోడ్డులో వేచి చూస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Man arrested with crores of rupees in bags

డబ్బులతో కూడిన రెండు గోనెసంచులను, నిందితుడిని ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బియ్యం మిల్లుల వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకెళ్తున్నట్టు అతడు పోలీసులకు తెలిపాడు. అయితే, డబ్బుకు సంబంధించిన ఎలాంటి రశీదులు, పత్రాలు లేకపోవడంతో భారీ నగదు స్వాధీనం చేసుకుని, విషయాన్ని పోలీసులు ఐటీ అధికారులకు తెలిపారు. డబ్బుతోపాటు నిందితుడిని వారికి అప్పజెప్పారు.

ఇలా చిక్కాడు...

ఓ వ్యక్తి పెద్దమొత్తంలో హవాలా డబ్బు తీసుకె ళుతున్నాడని సమాచారం అందడంతో రాచకొండ ఎస్‌ఓటీ సిబ్బంది, ఎల్‌బీనగర్‌ పోలీసులు వచ్చి డబ్బు బ్యాగును స్వాధీనం చేసుకుని, ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.విషయం తెలుసుకున్న రైస్‌ మిల్లుల వ్యాపారులు కొందరు ఎల్‌బీనగర్‌ పోలీ్‌సస్టేషన్‌కు చేరుకుని, తమకు తెలిసిన విరాలను అందజేసినట్లు తెలిసింది.

English summary
A man from Nellore has been nabbed by LB Nagar police in Hyderabad with currency bag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X