ప్రేమోన్మాది ఘాతుకం: యువతిపై బ్లేడుతో దాడి, తీవ్రగాయాలు
కరీంనగర్: పట్టణ శివారు కొత్తపల్లి పట్టణంలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించడం లేదని యువతిపై బ్లేడ్‌తో దాడి చేశాడు. పీజీ పూర్తి చేసి ఉద్యోగానికి సిద్దమౌతున్న 24 ఏళ్ల యువతిని ఇంటి ఎదురుగా ఉండే బొద్దుల సాయి గత మూడు నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాని వెంటపడుతున్నాడు. సదరు విషయం యువతి తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో పంచాయతీ పెట్టి యువకుణ్ని హెచ్చరించారు.

ఈ క్రమంలో యువతిపై కక్ష పెంచుకున్న బొద్దుల సాయి గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో యువతిపై బ్లేడుతో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
యువతి మెడకు రెండువైపుల, చేతికి గాయమైనట్లు వైద్యులు తెలిపారు. పంచాయతీ పెట్టిన తర్వాత వేధింపులను ఆపిన సాయి.. యువతిని తానే పెళ్లి చేసుకుంటానని తండ్రికి మెసేజ్‌లు పెట్టేవాడని కుటుంబసభ్యులు చెప్పారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ తెలిపారు.
డ్రైవర్ నిర్లక్ష్యంతో చిన్నారి మృతి
హైదరాబాద్ హబ్సిగూడలోని రవీంద్రనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల పాప మృతి చెందింది. పాప తండ్రి తన కమారుడిని స్కూల్ బస్సు ఎక్కించేందుకు రోడ్డుపైకి వచ్చారు. తన తండ్రి, అమ్మమ్మతో పాటు చిన్నారి జావ్లానా సైతం సోదరుడిని స్కూల్‌కు పంపేందుకు వెళ్లింది. ఈ క్రమంలో పాప తండ్రి డ్రైవర్‌తో మాట్లాడుతుండగా చిన్నారి జావ్లానా అమ్మమ్మ దగ్గరి నుంచి తన తండ్రి దగ్గరకు పరుగులు తీసింది.
ఈ క్రమంలో బస్సు డ్రైవర్ వాహనం తీస్తుండగా ప్రమాదవశాత్తు పాప జావ్లానా టైర్ కింద పడి ప్రాణాలు కోల్పోయింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ.. జాన్సన్ గ్రామర్ స్కూల్ ముందు ధర్నా చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications