హైదరాబాద్‌లో దారుణం: యువతిపై ప్రేమోన్మాది దాడి..
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైతు బజార్ వద్ద ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు.
హైదరాబాద్: దేశంలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపుల ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న విశాఖపట్నంలో మతిస్థిమితం లేని ఓ యాచకురాలిపై సైతం ఒక యువకుడు అత్యాచారానికి పాల్పడగా.. నేడు ో యువతిపై ప్రేమోన్మాది దాడి చేశాడు.
Recommended Video

Trending News : Top 20 Latest News Updates | Oneindia Telugu
హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైతు బజార్ వద్ద ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది.

రక్తపు మడుగులో పడిపోయిన ఆ యువతిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రేమ పేరుతో కొద్ది రోజులుగా యువతి వెంటపడుతున్న యువకుడే.. ఆమె పట్ల కక్ష పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ఆమెపై దాడి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. '












Click it and Unblock the Notifications