ఫేస్‌బుక్ పరిచయం: మహేష్ బాబు పేరు చెప్పి బోల్తా కొట్టించాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఫేస్‌బుక్ ద్వారా మోసం చేస్తున్న నేరగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకొని నమ్మించి నిండా ముంచుతున్నారు. శశి అనే వ్యక్తి ఏకంగా హీరో మహేష్ బాబు పేరును ఉపయోగించి మోసం చేశాడు.

సినీ హీరోల ఇమేజ్‌ని తన మోసానికి వాడుకున్నాడు. తనకు మహేష్ బాబు చాలా సన్నిహితుడని, అతనిని కలిసేలా చేస్తానని ఫేస్‌బుక్‍ ద్వారా చెప్పి, బంజారాహిల్స్‌లో పలువురిని మోసం చేశాడు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

Man cheats with the name of Mahesh Babu

తాను మహేశ్ బాబును కలిపిస్తానని, సినిమా కథ, పాటలు వినిపించే అవకాశం కల్పిస్తానని ఓ బాధితుడిని నమ్మించి, అతని నుంచి రూ.5000 తన అకౌంట్లో వేయించుకున్నాడు. డబ్బులు అకౌంట్లో వేసిన తర్వాత బాధితుడు ఫోన్ చేస్తే శశి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

కారు బోల్తా: ముగ్గురికి గాయాలు

రాజేంద్రనగర్ నార్సింగి ఔటర్ రింగ్‌రోడ్డుపై కారు బోల్తాపడింది. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఉంచి గచ్చిబౌలికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Man cheats with the name of Mahesh Babu in Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి