భార్య గొంతు కోసిన భర్త: అబ్దుల్లాపూర్‌లో పేలుళ్లు
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భర్త మద్యం మత్తులో బ్లేడ్‌తో భార్య గొంతు కోశాడు. దీన్ని గుర్తించిన స్థానికులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలనానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇదిలావుంటే, హైదరాబాదు సమీపంలోని అబ్దుల్లాపూర్‌మెట్ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లతో బండరాళ్లు తగిలి ఇద్దరు బాలికలకు గాయాలయ్యాయి. ఓ బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వాటర్ ట్యాంకు నిర్మాణానికి బండలు పగులగొట్టేందుకు పేలుళ్లు జరిపారు. ముందస్తు సమాచారం లేకుండా పేలుళ్లు జరపడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బంగారం పట్టివేత
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా అర కిలో బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈతకు వెళ్లి మృత్యువాత
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన మణికంఠ, ప్రవీణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన ఇనేశ్, తెనాలికి చెందిన నాగార్జున, హైదరాబాద్‌కు చెందిన రాఘవ, శ్రీధర్‌లు స్నేహితులు. వీరంతా హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నారు.
ఆదివారం ఇల్లెందుకు వచ్చిన వీరు ఈత కోసం బయ్యారం చెరువుకు వెళ్లారు. అలుగు సమీపంలోని రాముని గుం డం, భీముని గుండంలో నిల్వ ఉన్న నీటిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో మునిగి ఇనేశ్ (25), నాగార్జున (25) నీట మునిగి మృతిచెందారు.












Click it and Unblock the Notifications