కూతురిపై అత్యాచారం చేసిన వ్యక్తికి జీవిత ఖైదు: బాధితురాలి మృతి
హైదరాబాద్: కన్ను మిన్ను కానకుండా కాపాడాల్సిన వ్యక్తే కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతనికి కోర్టు జీవిత ఖైదు విధించింది. రెండేళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఆ వ్యక్తికి హైదరాబాదులోని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు.
అత్యాచార ఘటన తర్వాత బాధితురాలు మరణించింది. వికలాంగుడైన మల్లికార్జున్ (30) అనే వ్యక్తి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తూ వచ్చాడు. ఘటన జరిగి ఏడాది అవుతోంది. ఇప్పుడు మల్లికార్జున్‌కు ఆ కేసులో శిక్ష పడింది.
మల్లికార్డున్ నేరం చేశాడని ఇంచార్జీ న్యాయమూరి టి. రజని నిర్ధారించారు. అతనికి ఆమె కఠిన కారాగార శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధించారు. సంఘటన నిరుడు జూన్ 19వ తేదీన జరిగింది. ఇంటి పనులు చేసే తల్లి బయటకు వెళ్లిన సమయంలో మల్లికార్జున్ ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు.

అత్యాచారం జరగడంతో బాలికకు రక్తస్రావం జరిగింది. దీంతో భయపడిన మల్లికార్డున్ బాలిక లోదుస్తులను, తన దుస్తులను శుభ్రం చేశాడు. బాలిక ఇంటి వెలుపల ఏడుస్తూ ఉండడాన్ని ఇరుగుపొరుగు వారు గుర్తించారు. ఏమైందని తల్లి బాలికను అడిగింది.
తండ్రి వైపు వేలు పెట్టి చూపిస్తూ కూడా కూతురు ఏమీ చెప్పలేకపోయింది. ఏం జరిగిందని ఆమె భర్తను అడిగింది. తనకు ఏమీ తెలియదని అతను చెప్పాడు. మూడు రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మల్లికార్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాయాలతో బాలిక మరణించింది.












Click it and Unblock the Notifications