కవల బిడ్డలను చంపేసి దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: తన కవల కూతుళ్లను చంపేసి, దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హైదరాబాదులో జరిగింది. తమ 13 నెలల కూతుళ్లు మేఘ, మేఘనలకు విషం ఇచ్చిన తర్వాత దంపతులు ఎన్ బాలరాజు, సురేఖ సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఇనుప వ్యాపారం చేసే బాలరాజు ఆర్థికంగా దివాళా తీశాడని, ఆర్థిక కారణాల వల్లనే కుటుంబ సభ్యులు బలవన్మరణానికి పాల్పడ్డారని భావిస్తున్నారు.
ఆ విషాద సంఘటన హైదరాబాద్‌లోని సీతారాంబాగ్ అఫ్జల్‌సాగర్‌లో చోటుచేసుకుంది. బాలరాజు అనే 27 ఏళ్ల వ్యక్తి తొలుత ఎల్బీనగర్‌లో పాత ఇనుప సామాన్ల షాపు నిర్వహించాడు. ఆ తర్వాత అత్తాపూర్‌కు మార్చాడు. అయితే వ్యాపారంలో నష్టం వచ్చి అప్పులు పెరగడంతో దుకాణం ఎత్తేశాడు. ఆర్థిక సమస్యలు పెరిగాయి. అప్పులు ఇచ్చినవాళ్ల నుంచి ఒత్తిడి తీవ్రమైంది.

దీంతో విరక్తి చెందిన అతడు భార్య సురేఖ (24), ఏడాదిన్నర వయస్సున్న అతడి కవల పిల్లలు మేఘ, మేఘనలకు పాలల్లో విషం కలిపి తాగించాడు. ఆ తర్వాత సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. అయితే తెల్లారి పొద్దుపోతున్నా ఇంటి తలుపులు తెరవకపోవడంతో ఆందోళనకు గురైన రాజు తల్లి మణెమ్మ.. ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పింది.
కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకున్న రాజు కనిపించాడు. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా కుటుంబమంతా విగతజీవులై పడి ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి పోలీలులు పాల సీసాలు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications