స్త్రీ ప్రాణం తీసిన ఫోన్ పరిచయం, ప్రియుడిగా భావించి వ్యక్తి హత్య
మహబూబ్ నగర్: సెల్‌ఫోన్లో పరిచయమైన మహిళను లోబర్చుకొని అతిగా కల్లు తాగించి నగల కోసం దారుణంగా హత్య చేసిన ఘటనను పోలీసులు చేధించారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. తాడురు మండలం గుట్టలపల్లికి చెందిన పార్వతమ్మకు ఫోన్లో మల్లి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
ఇద్దరి మధ్య సెల్ ఫోన్ పరిచయం కొనసాగుతున్న క్రమంలో భర్త చనిపోయాడు. పార్వతమ్మ తరుచూ నిందితుడితో ఫోన్లో మాట్లాడుతూ.. అతడిని కలుసుకునేందుకు గత మే 23న తన ఇద్దరు పిల్లలను అన్నయ్య వద్ద వదిలేసి వెళ్లింది.
అక్కడికి వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. 27వ తేదీన కల్వకుర్తి మండలంలో శవమై కనిపించింది. పోలీసులు ఈ హత్య మిస్టరీని ఛేదించారు. సెల్ ఫోన్లో తరుచూ మాట్లాడిన వారి వివరాలు సేకరించడంతో నిందితుడి ఆచూకీ లభించింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా, వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

మృతురాలిని తీసుకెళ్లి కల్లు తాగించి హత్య చేసి కాళ్లకు ఉన్న 49 తులాల వెండి కడియాలు, 8 గ్రాముల బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్ చోరీ చేశాడు. ఆభరణాలు రికవరీ చేశారు.
అనుమానంతో హత్య
వివాహేతర సంబంధం అనుమానం నేపథ్యంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బూర్గుల గ్రామంలో జరిగింది.
కాశిరెడ్డి గూడెంకు చెందిన రమేష్, ఆంజనేయులు, నగేష్ అదే గ్రామానికి చెందిన దయాకర రెడ్డిని హత్య చేశారు. రమేష్ భార్యతో దయాకర్ రెడ్డికి వివాహేతర సంబంధం ఉందని ఆంజనేయులు ప్రచారంతో దయాకర్ రెడ్డి పైన కోపం పెంచుకున్న రమేష్ సమయం కోసం ఎదురు చూసి, 2014 డిసెంబర్ 13న ముగ్గురు స్నేహితులతో కలిసి హత్య చేశారు.












Click it and Unblock the Notifications