అమ్మాయిని ఎత్తుకెళ్లి బలవంతపు పెళ్లి: 15 రోజుల పాటు లైంగికదాడి
సంగారెడ్డి: బాలికను అపహరించి ఓ యువకుడు బలవంతంగా పెళ్లి చేసుకుని 15 రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు బాలిక ఆచూకీ కనిపెట్టి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం జోగిపేట సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మెదక్ జిల్లా జోగిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వి. నాగయ్య వెల్లడించారు.
అల్లా దుర్గం గ్రామానికి చెందిన దంపతులు తమ కుమార్తె (13)తో కలిసి పుల్కల్ మండల పరిధిలోని చౌటకూర్‌లో కాంట్రాక్టర్ బాలస్వామి వద్ద సీసీ రోడ్ల పనులు చేసేందుకు గత నెలలో వచ్చారు. అయితే చౌటకూర్‌కు చెందిన కొన్యాల యాదయ్య వద్ద ఉంటూ పనులు చేస్తున్నారు. ఈ క్రమం లో యాదయ్య సోదరుడు కొన్యాల రాజు బాలికను వేధించడం ప్రారంభించాడు
పనులు పూర్తయిన తర్వాత ఆ దంపతులు తమ కుమార్తెతో పనుల కోసం సంగారెడ్డికి వెళ్లారు. బాలికపై కన్నేసిన రాజు, యాదయ్య సాయంతో సంగారెడ్డికి వెళ్లి తమ ఏరియాలో పని ఉందని నచ్చజెప్పి తిరిగి చౌటకూర్‌కు తీసుకొచ్చాడు. గత నెల 28న రాజు బాలికను మాయమాటలతో నమ్మించి నర్సాపూర్‌కు తీసుకెళ్లాడు.

అక్కడ బాలిక కాళ్లకు ఉన్న 40 తులాల వెండి కడియాలను తీసుకుని రూ. 8వేలకు అమ్మాడు. ఆ డబ్బులతో తాళి, మెట్టెలు కొనుగోలు చేసి బాలికకు బలవంతంగా తాళికట్టి కట్టాడు. అనంతరం ఓ ఇంట్లో ఉంచి 15 రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఆ బాలిక తల్లిదండ్రులు పుల్కల్ పోలీస్‌స్టేషన్‌లో తమ కూతురు కనిపించడం లేదని ఈ నెల 1 న ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ఇందులో భాగంగా శనివారం ఆచూకీ తెలుసుకుని ఎస్‌ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు నర్సాపూర్‌లో బాలికతో ఉన్న నిందితుడైన రాజు, అతనికి సహకరించిన సోదరుడు యాదయ్యను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వారిని విచారించగా జరిగిన అసలు విషయం చెప్పారు. బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన రాజు, అతనికి సహకరించిన సోదరుడు యాదయ్యపై కిడ్నాప్, అత్యాచార కేసులతో పాటు ఫోక్స్ కేసును నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేయనున్నట్లు సీఐ నాగయ్య తెలిపారు.












Click it and Unblock the Notifications