కేటీఆర్‌కు ఊహించని ప్రశ్న!: సమాధానం ఏం చెప్పారంటే..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జుట్టు నెరిసిపోతుందంటే చాలు.. చాలామంది హైరానా పడిపోతుంటారు!. ఎక్కడ వయసు బయటపడుతుందోనని వారి భయం. అందుకే నల్ల రంగేసుకుని మరీ తామింకా యంగే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు.

ఇక పబ్లిక్ ఫిగర్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాభైల్లోకి అడుగుపెట్టినా సరే.. నవ యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే తనకలాంటి భయమేది లేదంటున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. జుట్టు తెల్లబడుతోంది సార్.. కాస్త రంగేసుకోండి.. అని ఓ వ్యక్తి ఇచ్చిన సలహాకు.. తానింకా కుర్రాడినేమి కాదు కదా! అంటూ ఆయన బదులిచ్చారు.

twitter:

కాగా, ఇటీవల పాతబస్తీలో విస్తృతంగా పర్యటించిన కేటీఆర్.. ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. ఆ సందర్భంగా కాసేపు క్రికెట్, బాస్కెట్ బాల్ ఆటలు ఆడారు. ఈ ఫోటోలు ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మాద్యమాల్లో పోస్టు చేయడంతో.. ఎంఎన్ ప్రపుల్ల అనే వ్యక్తి ఫోటోపై తన అభిప్రాయం వ్యక్తపరిచాడు.

'ఇప్పుడున్న మంత్రుల్లో మీరే యంగ్ లీడర్, ఈమధ్య మీ జుట్టు నెరిసినట్లు కనిపిస్తోంది. మంత్రులందరి కన్నా మీరే చిన్నవారు కాబట్టి, పెద్దవారిలా కనిపించకుండా జుట్టుకు రంగేసుకోండి' అంటూ ప్రపుల్లా కామెంట్ చేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ దీనిపై స్పందిస్తూ.. తానింకా కుర్రాడినేమి కాదు కదా! అంటూ బదులిచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MN Prapaullakumar, A man in twitter responded on Minister KTR photo.He suggested Ktr to use hair dye to cover the white hair
Please Wait while comments are loading...