దారుణం: ఇద్దరు కూతుళ్లపై ఏడాదిగా అత్యాచారం, తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి

హైదరాబాద్: శంషాబాద్‌లో దారుణం వెలుగు చూసింది. ఓ వ్యక్తి కన్నకూతుళ్ల పైనే కన్నేశాడు. వారిపై ఏడాదిగా అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. తాగిన మైకంలో వారి పట్ల విపరీతంగా ప్రవర్తించేవాడని తేలింది.

అతని తీరు పట్ల విసిగిపోయిన కన్నతల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దారుణం వెలుగు చూసింది. నేపాల్‌కు చెందిన నలభై ఏళ్ల వ్యక్తి కుటుంబంతో సహా తొలుత బీహార్‌కు వచ్చాడు. అక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి టోలీచౌకిలో ఉంటున్నాడు.

ఆ తర్వాత శంషాబాద్‌కు ఇల్లు మార్చాడు. అతను సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతనికి ఇద్దరు ఆడపిల్లలు. ఓ అమ్మాయికి పదిహేడేళ్లు ఉండగా, మరో అమ్మాయికి పద్నాలుగేళఅలు ఉన్నాయి. అతను సొంత కూతుళ్లపై అసభ్యంగా ప్రవర్తించేవాడు.

Man used to sexually harass daughters

గత ఏడాది కాలంగా పలుమార్లు అత్యాచారానికి కూడా పాల్పడ్డాడు. ఈ విషయాన్ని కూతుళ్లు తల్లికి చెప్పారు. దీంతో ఆమె భర్తను ప్రశ్నించింది. ఆ తర్వాత భర్తను బీహార్‌కు పంపించింది. అక్కడ కొన్నాళ్లు ఉన్న అతను తాను మంచిగా ఉంటానని చెప్పి తిరిగి హైదరాబాద్ వచ్చాడు.

కానీ అతని ప్రవర్తనలో మార్పు లేదు. దీంతో తల్లి ఇటీవల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కూతుళ్లు కూడా పోలీసులకు జరిగిన విషయం చెప్పారు. దీంతో వారు నిందితుడిని అరెస్టు చేశారు. అతనిని బుధవారం రిమాండుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+