రైతు బజారులో హరీశ్, పోచారం: గిట్టుబాటు ధరకే ఉల్లి(ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణలోని అన్ని జిల్లాల రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌ల శాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.
బుధవారం మెహిదీపట్నం రైతుబజార్‌లో ‘మనఊరు-మన కూరగాయలు' పేరిట ఏర్పాటు చేసిన ఉల్లి సబ్సిడీ విక్రయ కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం పూలమార్కెట్, కూరగాయల మార్కెట్‌లలో తనిఖీలు నిర్వహించారు.
రైతు బజార్‌లోని రైతులతో నేరుగా కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కూరగాయాల ధరలు భారీగా పెరగడంతో ప్రజలకు రూ. 21కే కిలో ఉల్లిని గిట్టుబాటు ధరకే అందించాలన్న సంకల్పంతో ఈ సబ్సీడి కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతుందన్నారు. కూరగాయలు, పూలు, పండ్ల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని వివరించారు.
మార్కెట్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌లో బెంగుళూరు తరహాలో అధునాతన వేలం కేంద్రాన్నిర్పాటు చేస్తామని మంత్రులు వెల్లడించారు.

మనఊరు-మన కూరగాయలు: రూ. 21కే కిలో ఉల్లి
తెలంగాణలోని అన్ని జిల్లాల రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌ల శాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.

మనఊరు-మన కూరగాయలు: రూ. 21కే కిలో ఉల్లి
బుధవారం మెహిదీపట్నం రైతుబజార్‌లో ‘మనఊరు-మన కూరగాయలు' పేరిట ఏర్పాటు చేసిన ఉల్లి సబ్సిడీ విక్రయ కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం పూలమార్కెట్, కూరగాయల మార్కెట్‌లలో తనిఖీలు నిర్వహించారు.

మనఊరు-మన కూరగాయలు: రూ. 21కే కిలో ఉల్లి
రైతు బజార్‌లోని రైతులతో నేరుగా కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మనఊరు-మన కూరగాయలు: రూ. 21కే కిలో ఉల్లి
అనంతరం వారు మాట్లాడుతూ కూరగాయాల ధరలు భారీగా పెరగడంతో ప్రజలకు రూ. 21కే కిలో ఉల్లిని గిట్టుబాటు ధరకే అందించాలన్న సంకల్పంతో ఈ సబ్సీడి కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
మనఊరు-మన కూరగాయలు: రూ. 21కే కిలో ఉల్లి
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతుందన్నారు. కూరగాయలు, పూలు, పండ్ల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని వివరించారు.

మనఊరు-మన కూరగాయలు: రూ. 21కే కిలో ఉల్లి
మార్కెట్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌లో బెంగుళూరు తరహాలో అధునాతన వేలం కేంద్రాన్నిర్పాటు చేస్తామని మంత్రులు వెల్లడించారు.
మనఊరు-మన కూరగాయలు: రూ. 21కే కిలో ఉల్లి
మెహదీపట్నం రైతుబజారులో బుధవారం సబ్సిడీ ఉల్లి విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఒక మహిళకు అందజేస్తున్న మంత్రి పోచారం, చిత్రంలో హరీశ్‌రావు తదితరులు.

Click it and Unblock the Notifications