రేపటినుంచి విద్యాసంస్థలు బంద్..

సెప్టెంబర్ 15 నుంచి వృత్తి విద్యా కళాశాలలను బంద్ చేస్తున్నట్లు యాజమాన్యాలు అల్టిమేటం ఇచ్చాయి. ఇదే విషయంపై ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కు కాలేజీ యాజమాన్యాలు వినతిపత్రం అందజేశాయి. ఫీజు బకాయిల కోసం గత 6 నెలలుగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి స్పందని లేదని మండిపడ్డాయి. కాలేజీ యాజమాన్యాల నిర్ణయంతో సుమారు 12 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

తెలంగాణలోని ప్రైవేట్, వృత్తి విద్యా, పీజీ, ఇంజినీరింగ్ కాలేజీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి కళాశాలలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరవధికంగా బంద్‌ కు సిద్ధమయ్యాయి. ఫీజు రీయింబర్స్‌ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కాలేజీల ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తమకు సుమారు రూ.10 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని తెలిపింది.

డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, బీఈడీ, నర్సింగ్ సహా అన్ని కాలేజీలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించాయి. రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలు జరగవు.. పరీక్షలు వాయిదా వేయాలని వర్సిటీలను కోరుతున్నాం. రేపటి నుంచి విద్యార్థులు కళాశాలలకు రావొద్దు. ఫీజు బకాయిలు చెల్లించకపోతే బంద్ చేపడతామని గతంలోనే సీఎస్ కు చెప్పినట్లు ఫెడరేషన్ నాయకులు తెలిపారు.

Managements of educational colleges in Telangana plan to close from September 15

రాష్ట్ర ప్రభుత్వం తమకు సుమారు రూ.10 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉందని.. ఈ నిధులు తక్షణమే విడుదల చేయకపోతే కాలేజీల నిర్వహణ తీవ్రంగా దెబ్బతింటుందని అన్నారు. విద్యారంగం అగాధంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా కాలేజీల యాజమాన్యాలు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ను కలిసి బకాయిల విడుదలకు విజ్ఞప్తులు చేశాయి. ఈ సమస్యపై ప్రభుత్వానికి ఫెడరేషన్ నాయకులు మెమోరాండం అందజేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+