'మంచిరెడ్డి వర్సెస్ మల్ రెడ్డి : దమ్ముంటే నిరూపించు.. పిచ్చి కుక్కలా అరవకు,'
రంగారెడ్డి : మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. పరస్పర ఆరోపణలతో ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నయీంతో సంబంధాలున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆరోపించడంతో ఈ వివాదానికి తెరలేసింది. ఇరువురు మంత్రుల మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఆరోపణల పర్వం సాగుతోంది.
మల్ రెడ్డి ఆరోపణల పట్ల తీవ్రంగా స్పందించిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. తన అనుచరులతో కలిసి స్థానిక చౌరస్తాలో బైఠాయించారు. ఈ సందర్బంగా మంచిరెడ్డి మాట్లాడుతూ.. దమ్ముంటే.. మల్ రెడ్డి తనతో చర్చకు రావాల్సిందిగా సవాల్ చేశారు. మరో రెండు గంటలపాటు చౌరస్తాలోనే బైఠాయిస్తానని చెప్పిన కిషన్ రెడ్డి.. మల్ రెడ్డి వచ్చి నయీంతో తనకున్న సంబంధాలను రుజువు చేయాలన్నారు.

దమ్ము ధైర్యం లేకనే మల్ రెడ్డి మొహం చాటవేసుకున్నారని విమర్శించిన కిషన్ రెడ్డి.. తనపై చేసిన ఆరోపణలు నిరూపించకుంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
మల్ రెడ్డి కౌంటర్ :
'మతి భ్రమించింది నాకు బ్రదర్.. ఏడేళ్ల నుంచి పేదోళ్ల రక్తం తాగినోడికి మతి భ్రమించింది. కిషన్ రెడ్డి డిమాండ్ చేసినట్లుగానే ఇప్పుడు నేను ఆధారాలు చూపిస్తున్నా.. దమ్ముంటే దీనిపై మాట్లాడమను' అని మంచిరెడ్డికి సవాల్ చేశారు మల్ రెడ్డి. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.
ఇబ్రహీంపట్నంలో సిట్ అధికారులు అరెస్టు చేసిన శ్రీహరితో కలిసి మంచిరెడ్డి భూ లావాదేవీలు సాగించారని, శ్రీహరిని అరెస్టు చేసినప్పుడు మంచిరెడ్డిని మాత్రం ఎందుకు అరెస్టు చేయలేదంటూ ప్రశ్నించారు మల్ రెడ్డి. 'దొంగలాగా ఓ మాఫియాతో కుమ్మక్కయిన నువ్వు.. మామూలు వసూళ్లు చేసుకునే నువ్వు.. పిచ్చి కుక్కలా అరవకు, ఆరోపణలు నన్నేం చేయలేవంటూ' మల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నయీంపై పొలిటికల్ వార్: దూరం పెట్టండి.. దమ్ముంటే రా.. మంచిరెడ్డిXమల్‌రెడ్డి
తన కొడుకు పేరిట ఆదిభట్లలో ఎకరా భూమి ఉన్న మాట వాస్తవమేనని మంచిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. 'ఒక ఎకరం కబ్జా చేసిందానికి ఆధారాలున్నాయని నువ్వే ఒప్పుకుంటున్నావు.. మరి దీనికేం సమాధానం చెబుతావ్' అంటూ నిలదీశారు మల్ రెడ్డి. మంచిరెడ్డి కొల్లగొట్టిన డబ్బును బయటపెట్టేవరకు ఊరుకోబోనని చెప్పిన మల్ రెడ్డి.. తన రాజకీయంతో పోల్చితే మంచిరెడ్డి రాజకీయానుభవమెంత అన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు.
మంచిరెడ్డి నయీంతో కుమ్మక్కయ్యాడని.. గతంలోను చాలా సందర్బాల్లో చెప్పానని, అయితే ఆధారాలతో సహా బయటపెట్టాలనే ఇన్నాళ్లు ఆగానని చెప్పారు మల్ రెడ్డి. తాను కబ్జాలు చేసినట్లు నిరూపిస్తే.. ఆ భూమిని ప్రభుత్వానికే ఇచ్చేస్తానంటూ మంచిరెడ్డికి సవాల్ చేశారు మల్ రెడ్డి.












Click it and Unblock the Notifications