Mohan Babu: బుద్ధి లేదా.. మీడియాపై మోహన్ బాబు ఫైర్..
ప్రముఖ నటుడు మోహన్ బాబు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన మీడియాతో దురుసుగా ప్రవర్తించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు మోహన్ బాబు వచ్చారు. ఆయన రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు రావడంతో మీడియా ప్రతినధులు అందరు అక్కడికి వెళ్లారు. అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులను సిగ్గు లేదా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోగోలు లాక్కోండని తన బౌన్సర్లకు సూచించారు. బుద్ధి లేదా అంటూ వ్యాఖ్యలు చేశారు.
మోహన్ బాబు వ్యాఖ్యలపై జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదని అన్నాయి. గతంలోనూ మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు మీడియాపై దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ వివాదంపై మోహన్ బాబు దురుసుగా వ్యవహరించారు. విష్ణు, మనోజ్ వివాదంపై ప్రశ్నించగా.. మీడియా ప్రతినిధులనే ఎదురు ప్రశ్నించారు.

"మీ ఇంట్లో నీ భార్యకు నీకు సంబంధం ఏంటో చెప్పగలవా" అంటూ మోహన్ బాబు ప్రశ్నించారు. ఏ సందర్భంలో ఎలాంటి ప్రశ్నలు అడగాలో తెలుసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులంటే తనకు చాలా ఇష్టమని డ్యామేజ్ కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇదే వివాదం పై మంచు మనోజ్ ను ప్రశ్నించగా.. ఆయన కూడా దురుసు మాట్లాడారు. భుజంపై సెగ్గడ్డొచ్చింది గోకుతారా అంటూ వంకరగా మాట్లాడారు.
అయితే మోహన్ బాబు షాద్ నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎందుకు వెళ్లారు.. ఏమైనా ఆస్తులు కొనుగోలు చేశారా.. లేక ఉన్న ఆస్తులను ఇతరులకు అమ్మడానికి వచ్చారా లేక తన వారసులకు ఆస్తి పంచడానికి వచ్చారో తెలియరాలేదు.












Click it and Unblock the Notifications