Mohan Babu: పోలీసులు ముందే మీడియాపై దాడి..!
మంచు ఫ్యామిలీ గొడవ డైలీ సీరియల్ మాదిరి కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నుంచి మంచు ఫ్యామిలీ వార్తల్లో ప్రధాన అంశంగా మారింది. జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటిలో సోమ, మంగళవారం హైడ్రామా కొనసాగింది. మోహన్ బాబు ఇంటిలో బౌన్సర్లను పెట్టడం.. ప్రతిగా మనోజ్ బౌన్సర్లను తీసుకెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. మంగళవారం సాయంత్రం మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. లోపల మోహన్ బాబు బౌన్సర్లు, బయట విష్ణు బౌన్సర్లు ఉన్నారు.
మనోజ్ గేటును తోసుకుని లోపలికి వెళ్లారు. దీంతో బౌన్సర్లు ఒకరికొకరు తోసుకున్నారు. ప్రైవేట్ సైన్యంతో ఘర్షణకు దిగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. బౌన్సర్లే పోలీసులుగా మారారా అంటూ నిలదీస్తున్నారు. ప్రైవేట్ బౌన్సర్లు మీడియా ప్రతినిధులను కొడుతుంటే.. అక్కడే ఉన్న పోలీసులు కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మనోజ్ గేటు తోసుకుని లోపలికి వెళ్లేటప్పుడు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ గురువారెడ్డి చూస్తూ ఉన్నారు.

కానీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీనిపై పోలీసుల సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా మోహన్ బాబు చేసిన దాడిలో పలువురు మీడియా ప్రతినిధులు గాయపడ్డారు. రంజిత్ అనే మీడియా ప్రతినిధికి తీవ్ర గాయమైంది. రంజిత్ దవడ పైభాగంలో ఉండే జైగోమాటిక్ బోన్ మూడు చోట్ల విరిగిపోయింది. స్కానింగ్ చేసిన వైద్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెబుతున్నారు. మోహన్ బాబు దాడి చేయడాన్ని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి.
మోహన్ బాబు కేసు నమోదు చేయాలని పోలీసులను కోరాయి. జర్నలిస్టుల ఫిర్యాదుతో పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు పెట్టారు.












Click it and Unblock the Notifications