Hyderabad Weather Today: బీ అలర్ట్ - వైరస్ విస్తరిస్తున్న వేళ- ఆరెంజ్ అలర్ట్..!!
చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయిలో పడిపోతున్నాయి. హైదరాబాద్ చలితో వణికిపోతోంది. అన్ని జిల్లాల్లో చలి విజృంభిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సగటున 8- 9 డిగ్రీలు, సెంట్రల్ తెలంగాణలో 10- 11 డిగ్రీలు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 11- 15 డిగ్రీల మధ్య సగటుతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. పైగా ఎనిమిది జిల్లాలు.. ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నారాయణపేట్, మేడ్చల్- మల్కాజ్‌గిరి ఇల్లాల్లో ఆరెంజ్ అలర్ట్‌ను వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయిలో
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరిగాయి. హైదరాబాద్ నగరంలోనే ఎక్కువగా ఒమిక్రాన్ కాంటాక్టులు ఉన్నాయా అనే కోణంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. టోలీచౌకీలో పెద్ద ఎత్తున పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో చలి పెరగటంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నగరంలో ఉదయం 10 వరకు చలి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గ్రేటర్ శివారు ప్రాంతాల్లో నాలుగు రోజులుగా రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గిపోతుండడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు.

వణికిపోతున్న హైదరాబాద్
చలి కారణంగా శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్, దుండిగల్, అల్వాల్, మల్కాజిగిరి, కుషాయిగూడ, ఉప్పల్, నాగోలు, హయత్‌నగర్, తుర్కయాంజల్, బడంగ్‌పేట్, మీర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, రాజేంద్రనగర్, నార్సింగి, గండిపేట్, తదితర ప్రాంతాల్లోని రహదారులు రాత్రి 8 తర్వాత నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాజేంద్రనగర్‌లో అత్యల్పంగా 9.9 డిగ్రీలు.. రామచంద్రాపురం, శేరిలింగంపల్లిలో 11.1 డిగ్రీల చొప్పున.. సికింద్రాబాద్‌లో 12.1, హయత్‌నగర్‌లో 12.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగత్రలు నమోదయ్యాయి. ఏపీలో కూడా చలి విజృంభిస్తోంది. విశాఖ జిల్లా చింతపల్లిలో 5.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

తీవ్రంగా పొగమంచు..రాకపోకలపై ఎఫెక్ట్
ఈ క్రమంలో.. ఉదయం 4 గంటల నుంచి 8.30 గంటల వరకు పొగమంచు తీవ్రంగా ఉంటోంది.ఉత్తరాది రాష్ట్రాల మీదుగా దక్షిణ భారతదేశంలోకి ఉపరితల శీతల గాలులు ప్రవేశిస్తున్నాయి. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, ఏపీ తదితర రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. మినుములూరులో 9.13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అవగా... సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఏజెన్సీల్లో పొగమంచుతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఉత్తరాది రాష్ట్రాల నుంచి చలిగాలులు
ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్, కశ్మీర్, లద్ధాఖ్, గిల్గిత్-బల్టిస్థాన్, ముజఫర్‌బాద్, ఉత్తరాఖండ్, హరియాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ తీవ్ర చలిగాలు వీస్తున్నాయి. ఢిల్లీలో 4.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కశ్మీర్‌లోని పెహల్గామ్‌లో మైనస్ 8.7 డిగ్రీలు, శ్రీనగర్‌లో మైనస్ 6 డిగ్రీలు, రాజస్థాన్‌లోని ఫతేపూర్‌లో మైనస్ 4.7 డిగ్రీలు, చురులో మైనస్ 2.6 డిగ్రీలు.
ఈశాన్య ప్రాంతంలోని సికర్‌లో మైనస్ 2.5 డిగ్రీలు, అమృత్‌సర్‌లో మైనస్ 0.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ స్థాయిలో చలి తీవ్రత పెరగటంతో.. అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా సీనియర్ సిటిజన్స్ తో పాటుగా పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications