Gaddar: గద్దర్ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన మావోయిస్టు పార్టీ..

ప్రజా యుద్ధనౌక గద్దర్ మృతి పై మావోయిస్టు పార్టీ సంతాపం వ్యక్తం చేసింది. గద్దర్‌ మరణం రాష్ట్ర ప్రజలందరికీ ఆవేదన కలిగించిందని పేర్కొంది. జననాట్య మండలి ఏర్పాటులో గద్దర్ కృషిని కొనియాడింది. నాలుగు దశాబ్దాల పాటు పీడిత ప్రజల పక్షాన గద్దర్ నిలబడ్డారని మావోయిస్ట్ పార్టీ గుర్తు చేసింది. గద్దర్ అంటే దేశంలో, రాష్ట్రంలో తెలియని వారు వుండరని పేర్కొంది. గదర్ మరణం తమను తీవ్రంగా కలిచివేసిందని తెలిపింది. నగ్జల్బరి, శ్రీకాకులం పోరాటాల ప్రేరణతో తెలంగాణలో భూస్వాము వ్యతిరేకంగా గద్దర్ పోరాటం చేశారని గుర్తు చేసింది.

గద్దర్ 1972- 2012 వరకు మావోయిస్టు పార్టీ సభ్యుడిగా ఉన్నారని వివరించింది. 80వ దశకంలో నాలుగేళ్ల దళ జీవితం కొనసాగించారని మావోయిస్టు పార్టీ గుర్తు చేసింది. తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో పాటలు, నాటికలు, బుర్ర కథలు, ఒగ్గు కథల రూపంలో గద్దర్ ప్రజలను చైతన్య పరిచారని లేఖలో రాసింది. మలి దశ ఉద్యమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడిగా గద్దర్ పని చేశాడని మావోయిస్టు పార్టీ వివరించింది. దోపిడీ పాలకుల బూటకపు ఎన్ కౌంటర్లలో మరణించిన విప్లవ కారుల శవాలను తమ కుటుంబాలకు చేరకుండా చేసిన సందర్భంలో.. శవాల స్వాధీన ఉద్యమానికి గద్దర్ నాయకత్వం వహించాడని మావోయిస్టు పార్టీ కొనియాడింది.

 Gaddars

1997లో గదర్ పై కూడా నల్లదండు ముఠా, పోలీసులు కలిసి గద్దర్ పై కాల్పులు చేశారని మావోయిస్ట్ పార్టీ ఆరోపించింది. ఐదు తూటాలు శరీరంలో దూసుకెళ్లినా.. గదర్ ప్రాణాలతో నిలిచారని చెప్పారు. చివరి కాలంలో పార్టీ నింబంధనవళికి విరుద్ధంగా పాలక పార్టీలతో కలవడంతో మా పార్టీ సోకాజ్ నోటీస్ ఇచ్చిందని గుర్తు చేసింది. దీనితో గద్దర్ 2012లో పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేశాడని పేర్కొంది. దాన్ని కూడా పార్టీ ఆమోదించినట్లు వివరించింది. 2012 వరకు పీడిత ప్రజల పక్షాన నిలిచిన గదర్ ఆతరువాత బూర్జువా పార్లమెంట్ మార్గాన్ని ఎంచుకున్నాడని అని మావోయిస్టు పార్టీ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+