మావోయిస్టుల ఘాతుకం: పంచాయతీ సెక్రటరీ సహా ఇద్దరి హత్య
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరిని గొడ్డలితో నరికి చంపారు. వాజేడులో పెనుగోలు కాలనీలో పేరూరు పంచాయతీ కార్యదర్శి ఉయికా రమేశ్, స్థానికుడు ఉయికా అర్జున్‌ను గురువారం అర్ధరాత్రి హత్య చేశారు మావోయిస్టులు.
కాగా, ఈ హత్యలను సమర్థిస్తూ వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత సంతకంతో మావోయిస్టులు ఘటనా స్థలంలో రెండు లేఖలు వదిలి వెళ్లారు. రమేశ్‌ను గొడ్డలితో నరికిన సమయంలో ఆయన భార్య గట్టిగా కేకలు వేయడంతో మావోయిస్టులు అక్కడ్నుంచి పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

తీవ్ర గాయాలపాలైన రమేశ్‌ను 108 అంబులెన్స్‌లో ఏటూరునాగారం ఆస్పపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మరో స్థానికుడు అర్జున్ ఉయికాను కూడా మావోయిస్టులు దారుణంగా నరికి చంపారు. ఈ రెండు హత్యలు స్థానికంగా కలకలం సృష్టించాయి.
ఇది ఇలావుండగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా దక్షిణ ప్రాంతంలోని బస్తర్ డివిజన్‌లో శుక్రవారం ఉదయం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దాదాపు 10 మంది మావోయిస్టులు మరణించారు.
జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), నక్సలైట్ల మధ్య సుక్మాలోని కొంటాలోని భెజ్జీ ప్రాంతంలో ఉదయం 6 గంటలకు ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. భెజ్జీ ప్రాంతంలోని ఒక ఇన్‌ఫార్మర్ నుంచి నక్సలైట్ల గురించి సమాచారం అందిందని.. ఆ తర్వాత డీఆర్జీ జవాన్ల బృందాన్ని భెజ్జీ అడవులకు పంపామని ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ పూర్తయితే మరింత సమాచారం అందుతుందని ఎస్పీ వెల్లడించారు.












Click it and Unblock the Notifications