Mariamma lockup death: కేసీఆర్-భట్టిపై ఫైర్: దొర తెలంగాణకు చెక్: ఇక పాదయాత్ర: మందకృష్ణ
హైదరాబాద్: దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఉద్దేశపూరకంగా నిర్వీర్యం చేస్తున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) నేత మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. ఈ విషయంలో డీజీపీ మహేందర్ రెడ్డి వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందని, ఆయన ముఖ్యమంత్రికి పరోక్షంగా సహకరిస్తున్నారని విమర్శించారు. మరియమ్మ లాకప్ డెత్ కేసును నిర్వీర్యం చేసే విషయంలో కాంగ్రెస్-టీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయని మండిపడ్డారు. 48 గంటల్లోగా తమ డిమాండ్లకు ప్రభుత్వం స్పందించకపోతే- ఉద్యమిస్తామని హెచ్చరించారు.

దిశ కేసులో
ఈ ఉదయం ఆయన సికింద్రాబాద్ పార్శీగుట్టలోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మరియమ్మ లాకప్ డెత్ కేసులో కేసీఆర్ ద్వంద్వనీతిని అనుసరిస్తోన్నారని అన్నారు. శంషాబాద్‌లో గ్యాంగ్‌రేప్‌కు గురైన దిశ వ్యవహారంలో యుద్ధ ప్రాతిపదికన స్పందించిన ముఖ్యమంత్రి.. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసును ఎందుకు నీరుగార్చడానికి ప్రయత్నిస్తోన్నారని ప్రశ్నించారు. దిశ కేసులో మృతురాలి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ఇచ్చిందని అన్నారు.

మరియమ్మకు ఎందుకు ఇవ్వరు..
గాల్వన్ లోయలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైన్యం చేతుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి కూడా ముఖ్యమంత్రి సహాయనిధి నుంచే ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు.దళిత మహిళ మరియమ్మ కేసులో ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కేసును నీరుగార్చే విషయంలో కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు. భట్టి విక్రమార్క.. కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారని, కేసీఆర్ భజన చేస్తోన్నారని మండిపడ్డారు.

కనీసం ఎఫ్ఐఆర్ కూడా
మరియమ్మ లాకప్ డెత్ కేసులో ఇప్పటివరకు వరకు పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని మందకృష్ణ మాదిగ విమర్శించారు. దళితులపై దాడులు చేస్తే సహించబోమంటూ ప్రకటనలు చేస్తోన్న కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతోన్నారని విమర్శించారు. పోలీసుల చిత్రహింసల వల్లే మరియమ్మ చనిపోయిందనే విషయంపై డీజీపీకి స్పష్టత ఉన్నప్పటికీ.. ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదని అన్నారు. మరియమ్మ కుమారుడి చర్మం ఉడిపోయేలా పోలీసులు కొట్టారని ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు.

48 గంటల్లో చర్యలు..
మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలనే విషయంపై తాము సోమవారం డీజీపీని కలుస్తామని అన్నారు. ఈ 48 గంటల్లో డీజీపీ చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసుల అత్యుత్సాహం వల్లే మరియమ్మ మరణించిందని, ఈ విషయంలో తెలంగాణ డీజీపీకి కనీసం సోయి లేదా? అని మందకృష్ణ ప్రశ్నించారు. మరియమ్మ విషయంలో కేసీఆర్ దళితులకు మూడు నామాలు పెట్టారని ధ్వజమెత్తారు. కేసీఆర్ డ్రామాలను దళితులు పసిగట్టలేమని అనుకోవడం భ్రమే అవుతుందని చెప్పారు. దళితులపై దాడులు, అత్యాచారాలు జరిగిన ప్రతిసారీ కేసులు నమోదు కాకుండా జాగ్రత్తలను తీసుకుంటోన్నారని, దీనికి కేసీఆర్ మధ్యవర్తిత్వం వహిస్తోన్నారని ఆరోపించారు.

సైద్ధాంతిక పోరాటానికి సిద్ధం..
అధికార టీఆర్ఎస్‌పై సైద్ధాంతిక పోరాటానికి తాము సిద్ధమౌతామని మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. సైద్ధాంతిక పోరాటాలు చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదని అన్నారు. ఈ తరహా పోరాటాలను వామపక్షాలు ఎప్పుడో మానుకున్నాయని చెప్పారు. ఆ బాధ్యతను తాము స్వీకరిస్తామని ఆయన తేల్చి చెప్పారు. దొర తెలంగాణకు ప్రత్యామ్నాయంగా సామాజిక తెలంగాణను నిర్మిస్తామని అన్నారు. ఇందులో భాగంగా- సైకిల్ యాత్ర, పాదయాత్రలకు శ్రీకారం చుట్టబోతోన్నామని తెలిపారు. సామాజిక తెలంగాణ యుద్ధభేరి నినాదంతో 119 నియోజక వర్గాల్లో అణగారిన వర్గాలను చైతన్యవంతులను చేస్తామని అన్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications