తలసాని వ్యవహారాన్ని తేల్చండి: స్పీకర్‌కు మర్రి శశిధర్ రెడ్డి లేఖ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి శాసనసభ్యుడిగా గెలిచి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్ఱభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పనిచేస్తున్న తలసాని శ్రీనివాస యాదవ్ వ్యవహారాన్ని తేల్చాలని కాంగ్రెసు తెలంగాణ నాయుకుడు మర్రి శశిధర్ రెడ్డి స్పీకర్ మధుసూదనా చారిని కోరారు. ఈ మేరకు ఆయన స్పీకర్‌కు ఓ లేఖ రాశారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారా, లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. ఒకవేళ తలసాని రాజీనామా చేసి ఉంటే దాన్ని ఎందుకు ఆమోదించడం లేదో తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

టిడిపి శాసనసభ్యుడైన తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి, గవర్నర్ నరసింహన్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన విమర్సించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించలేనప్పుడు గవర్నర్ పదవిలో నరసింహన్ కొనసాగకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
శాసనసభ ఎన్నికల్లో తలసాని శ్రీనివాస యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచి టిఆర్ఎస్‌లో చేరారు. ఆ సమయంలో ఆయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే, ఆయన స్పీకర్ ఆ రాజీనామాను ఆమోదించలేదు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications