గెలిపిస్తే విజయ యాత్ర చేస్తా-లేకపోతే నా శవయాత్రే-ఓటర్లతో పాడి కౌశిక్ రెడ్డి..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగియబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఇవాళ తుది విడత ప్రచారం చేస్తున్న కౌశిక్ రెడ్డి ఓటర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పుడు రాష్ట్రంలో అంతా మాట్లాడుకుంటున్నారు.
ఇంతకీ హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్ధి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలేంటో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. ఎల్లుండి జరిగే ఎన్నికల్లో తనను హుజారాబాద్ నుంచి పోటీ చేస్తున్న తనకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్ధించారు. అంతటితో ఆగకుండా తనకు ఓటేయకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పేశారు. తనకు ఓటేసి గెలిపిస్తే ఏం జరుగుతుందో, గెలిపించకపోతే ఏం జరుగుతుందో కౌశిక్ రెడ్డి ఓటర్లకు చెప్పారు. దీంతో వారంతా ఒక్కసారిగా షాకయ్యారు.

డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇందులో తాను గెలిస్తే 4న విజయయాత్ర చేస్తానని, లేకపోతే కుటుంబంతో కలిసి సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని పాడి కౌశిక్ రెడ్డి ఓటర్లకు తెలిపారు. అప్పుడు తన శవయాత్ర చేయాల్సి ఉంటుందని ఓటర్లతో వ్యాఖ్యానించారు. దీంతో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఓటర్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓటర్లను బెదిరించడం ఏంటనే చర్చ జరుగుతోంది.
డిసెంబర్ 4న విజయ యాత్ర చేస్తా లేదంటే నా శవ యాత్ర చేయండి. నాకు ఓటేసి గెలిపియ్యకపోతే కుటుంబంతో సహ ఆత్మహత్య చేసుకుంటా.
— 𝐏𝐫𝐚𝐝𝐞𝐞𝐩 𝐁𝐨𝐝𝐚𝐩𝐚𝐭𝐥𝐚 (@pradeeepjourno) November 28, 2023
- హుజురాబాద్ BRS అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి.#TelanganaElections2023 pic.twitter.com/TtOeXBusUF












Click it and Unblock the Notifications