అఫ్జల్‌గంజ్‌‌లో భారీ అగ్ని ప్రమాదం: 25షాపులు దగ్ధం, భారీగా ఆస్తి నష్టం

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: నగరంలోని అప్జల్‌గంజ్‌ ప్రాంతంలో గల సుల్తాన్‌షాహీలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముక్తార్‌గంజ్‌లోని టైర్లు, వాహనాల బేరింగ్‌లు విక్రయించే దుకాణాల సముదాయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి ఉవ్వెత్తున మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై పరుగుతీశారు. స్థానికులు సమాచారంతో సుమారు 10 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.

Massive Fire Accident In Afzalgunj

షాపులు ఇరుకుగా ఉండటంతో మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది కొంత ఇబ్బందిపడ్డారు. ఈ ప్రమాదంలో 25 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఇందులో ఆరు మోటార్ షాపులున్నాయి. భారీగా ఆస్తినష్టం సంభవించింది. దుకాణ సముదాయం మూసివుండటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాద నష్టం అంచనా వేసేందుకు వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Massive Fire Accident occurred at Afzalgunj in Hyderabad on Saturday morning.
Please Wait while comments are loading...