హైదరాబాద్ ఖాళీ అవుతోంది: అర్ధరాత్రి వరకూ ట్రాఫిక్ జామ్: ఈ రూట్లల్లో ఇంకో రెండ్రోజులు ఇంతే

ఇంకో మూడు రోజుల్లో తెలుగు లోగిళ్లల్లో సంక్రాంతి పండగ సందడి నెలకొనబోతోంది. దీనికోసం రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధమౌతోన్నాయి. ఇంటి ముందు రంగవల్లులు, కోడిపందేలు, గంగిరెద్దుల ఆటలతో వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణల్లో పండగ కోలాహలం ఏర్పడనుంది. తెలుగువారికి సంక్రాంతి పెద్ద పండుగ. కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో ఈ పండగను జరుపుకోవడానికి స్వస్థలాలకు తరలి వెళ్లడం ఆనవాయితీ.

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సెలవులను ప్రకటించాయి. దీంతో సంక్రాంతి పండుగ సెలవుల రద్దీ హైదరాబాద్ లో నెలకొంది. సిటీ ఖాళీ అవుతోంది. స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులతో నగర రోడ్లు కిటకిటలాడుతున్నాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకూ పఠాన్‌చెరు, రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్ మొదలుకుని కూకట్‌పల్లి, ఎస్ఆర్‌నగర్, మైత్రీవనం, అమీర్‌పేట్, బస్టాప్‌లన్నీ ప్రయాణికులతో క్రిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల తాకిడితో వాహనాల రాకపోకలు స్తంభించిపోతున్నాయి.

Massive Sankranti Rush at KPHB Colony and Maitrivanam Bus Stand in Hyderabad

టీజీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల కోసం రెండు రాష్ట్రాల మధ్య వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడిపిస్తోన్నాయి. తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి వరకూ ఈ బస్సులు అందుబాటులో ఉంటోన్నాయి. మహాత్మా గాంధీ సెంట్రల్ బస్‌ స్టేషన్, జూబ్లీ బస్‌ స్టేషన్లలల్లో ప్రయాణికుల తాకిడి కనిపిస్తోంది. శుక్రవారం రాత్రి వందలాది మంది ప్రయాణికులతో ఈ మార్గం మొత్తం క్రిక్కిరిసిపోయింది. బస్ స్టాప్ లన్ని కిటకిటలాడాయి. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకూ ట్రాఫిక్ జామ్ నెలకొంది.

సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని అధిగమించడానికి అటు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పదుల సంఖ్యలో అదనపు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి స్టేషన్ నుంచీ ఆయా రైళ్లు ఏపీ, తెలంగాణల్లో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తోన్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే మార్గాల్లో వాహనాల రాకపోకలు పెద్ద ఎత్తున స్తంభిస్తోన్నాయి. గంటల కొద్దీ పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

సిటీ దాటడానికే ఎక్కువ సమయం పడుతోంది. ఉప్పల్ చౌరస్తా, ఎల్బీనగర్ జంక్షన్లల్లో గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోతోంది. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపైనా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చౌటుప్పల్‌ పంతంగి టోల్ ప్లాజా వద్ద శుక్రవారం నుంచి భారీ వాహనాల రాకపోకలు స్తంభించాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. విజయవాడ, ఖమ్మం, విశాఖపట్నం వైపు వెళ్లే రూట్లల్లో డైవర్షన్లు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+