ఎన్నికలు: కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించిన ప్రభుత్వం

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు తీపి కబురు చెప్పింది. సోమవారం (మే 13న)నాడు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ సిబ్బంది, ఉద్యోగులకు మంగళవారం ఆన్ డ్యూటీగా పరిగణించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మే 14వ తేదీన ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు మినహా మిగితా అన్ని చోట్లా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

May 14th is a paid holiday for poll employees workers

ఎన్నికలకు అంతా సిద్ధం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం (మే 13వ తేదీ 2024)నాడు జరగనున్న 17 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. లోక్‌​సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల పరికరాలను ఆయా బూత్​ లకు అధికారులు తరలించారు. పటిష్ఠ బందోబస్తు మధ్య ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. హైదరాబాద్ లోక్ సభ ఎన్నికల పోలింగ్‌​పై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 1,944 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. లోక్‌సభ నియోజకవర్గంలో 22 లక్షల 17వేల 305 మంది ఓటర్లు ఉండగా తగినన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఓటింగ్ పెంచే చర్యల్లో భాగంగా మారుమూల తండాలు, గూడాల్లో అనుబంధ పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసు బలగాలు ఎక్కడికక్కడ భారీగా మోహరించాయి. అన్ని జిల్లాల్లో రిటర్నింగ్‌ అధికారులు డీఆర్సీ కేంద్రాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ యాకుత్‌పురాలో ఎన్నికల సామగ్రి కేంద్రాన్ని పరిశీలించారు సీఈవో వికాస్‌ రాజ్. విధుల్లో పోలింగ్‌ సిబ్బంది ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

48 మంది ఉద్యోగులపై కేసు నమోదు

నల్గొండ జిల్లా దేవరకొండలో 48 మంది ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై దేవరకొండ ఆర్డీవో శ్రీరాములు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు గైర్హాజరైన ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+