మేడారం మోనాలిసా.. అందమైన ఐపీఎస్ ఆఫీసర్.. ఆమె డ్యాన్స్ తో సోషల్ మీడియా రచ్చ!

ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సోషల్ మీడియా ప్రభావంతో దేశ విదేశాలలోని ప్రతి ఒక్కరికి తెలిసే జాతర అయింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రధాన మీడియా కంటే సోషల్ మీడియానే హల్చల్ చేసింది. అంతేకాదు మేడారం మోనాలిసా అంటూ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది.

ఆ ఐపీఎస్ ఆఫీసర్ ను మేడారం మొనాలిసా చేసేసిన సోషల్ మీడియా

గతంలో కుంభమేళాలో పూసల అమ్ముకునే ఒక యువతి మోనాలిసాగా, ప్రస్తుతం సెలబ్రిటీగా మారిపోగా, ఈసారి మేడారం జాతరలో ఒక ఐపీఎస్ అధికారిణి ఉత్సాహంగా చేసిన గిరిజన డాన్స్ తో నెటిజన్ల మనసులు గెలుచుకుంది. సోషల్ మీడియా అక్కడితో ఆగితే బాగుండేది, ఆమె చేసిన డాన్స్ వీడియోలతో మేడారం మోనాలిసాను చేసేసింది.

medaram ips vasundhara yadav highlights by social media as medaram monalisa her dance goes trending

సోషల్ మీడియాలో ఐపీఎస్ అధికారిణిపై షాకింగ్ పోస్టులు

బాగా చదువుకుని ఐపీఎస్ అధికారిణిగా శిక్షణ పొంది, తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న ఒక హయ్యర్ అఫీషియల్ గురించి పోస్టులు పెడుతున్నాము అన్న ఆలోచన కూడా లేకుండా, అందమైన ఐపీఎస్ ఆఫీసర్, మేడారం మోనాలిసా, అందంగా డాన్స్ చేసిన ఐపీఎస్, గిరిజన నృత్యాలతో మేడారం మోనాలిసా, అదుర్స్ అనిపించేలా డాన్స్ చేసిన ఐపీఎస్ అధికారిణి అంటూ రకరకాల పోస్టులు పెడుతున్నారు.

మంత్రి సీతక్కతో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్

మంత్రి సీతక్క, ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అక్కడ ఉన్న మిగతా సిబ్బందితోపాటు, డాన్స్ చేసిన ఆమెను అందంగా ఉందన్న కారణంతో సోషల్ మీడియాలో తెగ హైలెట్ చేస్తున్నారు. మేడారంలో మెరిసిన అందమైన ఆఫీసర్ అంటూ ఆమె గురించి పోస్ట్ చేసిన వెంటనే ఆమె గురించి సెర్చ్ చేశారు సోషల్ మీడియాలో ఉత్సాహవంతులు.

కల్లూరు ఏసీపీగా వసుంధర యాదవ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజం గడ్ కు చెందిన 2023బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి అని చెప్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు సబ్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న అజయ్ యాదవ్ ను పెళ్లి చేసుకున్న ఆమె కల్లూరు ఏసిపిగా పని చేస్తున్నట్టు ఆమె పుట్టుపూర్వోత్తరాలన్నీ సెర్చ్ చేసేసారు. గతంలో గ్రేహౌండ్స్ లో పనిచేసిన అనుభవం ఉన్న ఆమె కల్లూరు ఏసిపి గా బాధ్యతాయుతంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం పని చేస్తున్నారు.

విధుల నిర్వహణలో కాదు డ్యాన్స్ తో ఇదేం హైప్ అబ్బా..

మేడారం జాతరలో భద్రత పర్యవేక్షణకు వచ్చిన వసుంధర యాదవ్ నిర్వర్తించిన విధుల కంటే, ఆమె డాన్స్ ను హైలెట్ చేసిన సోషల్ మీడియా ఆమెను మేడారం మోనాలిసా గా అభివర్ణించడం సోషల్ మీడియాలో కనబడుతుంది. పూసల అమ్ముకున్న మోనాలిసా కు, ఐపీఎస్ ఆఫీసర్ వసుంధర యాదవ్ కు లింకు పెట్టి సోషల్ మీడియా పబ్లిసిటీ చేయడం ఓ రకంగా షాక్ కు గురిచేస్తుంది. బాధ్యతాయుతమైన ఆఫీసర్ ను, వారి సేవలకు గుర్తిస్తే బావుంటుంది అన్న అభిప్రాయం పలువురి నుండి వినిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+