మేడారం జాతర: 14కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్.. చుక్కలు చూస్తున్న భక్తులు!

తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో అశేష జనం అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. నాలుగు రోజులుగా మేడారం అడవుల్లో ఇసుకేస్తే రాలనంత మంది జనం అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. జనవరి 28వ తేదీ రాత్రి సారలమ్మ, జనవరి 29వ తేదీ రాత్రి మేడారం గద్దెలపైకి సమ్మక్క రావడంతో భక్తులు భారీగా మేడారానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు.

మేడారం జాతర ట్రాఫిక్ జామ్

తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేడారం జాతరలో ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవడం పోలీసులకు చాలా పెద్ద టాస్క్. దీనికి సంబంధించి ఆరు నెలల ముందు నుంచే కసరత్తు చేస్తారు. ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించి ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా రూట్లను నిర్ణయిస్తారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ఎక్కడైనా సరే ఇబ్బంది ఉంటే వెంటనే అక్కడ సమస్యను పరిష్కరించి ట్రాఫిక్ సజావుగా సాగేలా చూస్తారు.

Medaram Jathara 14-kilometer traffic jam devotees are facing immense difficulties with traffic

14 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

సిబ్బంది నిర్లక్ష్యమో, లేక సరైన ప్లానింగ్ లేకపోవడమో కానీ మేడారం జాతరలో ట్రాఫిక్ జామ్ కు కారణమైంది. తాడ్వాయి నుంచి మేడారం రూట్ లో ఆర్టీసీ బస్సులు, వీవీఐపీ వాహనాలు, విఐపి వాహనాలతో పాటు, ప్రైవేటు వాహనాలు భారీగా రావడంతో ట్రాఫిక్ ఇబ్బంది నెలకొంది. మొత్తం 14కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఈ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి మూడు గంటల సమయం పైన పడుతుందని అధికారుల అంచనా వేశారు.

తాగటానికి నీళ్ళు లేవు, తినటానికి ఫుడ్ దొరకదు.. ట్రాఫిక్ లోనే

గోవిందరావుపేట నుండి పస్రా వరకు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఆ రహదారి డబుల్ రోడ్డు అయినప్పటికీ మూడు వరుసల్లో వాహనాలు రావడంతో, ఆ వాహనాలను క్రమబద్దీకరించడం లో ట్రాఫిక్ పోలీసులు ఫెయిలయ్యారు. ఇక్కడ ట్రాఫిక్ లో చిక్కుకున్న లక్షల మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు. తాగడానికి నీళ్లు లేక, తినడానికి ఫుడ్ దొరక్క, ట్రాఫిక్ లోనే చిక్కుకొని విలవిలలాడుతున్నారు.

ట్రాఫిక్ లో చిన్నారుల, వృద్ధుల కష్టం అంతా ఇంతా కాదు

ఈ ట్రాఫిక్ ని క్లియర్ చేయడం కోసం పెద్ద ఎత్తున ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తున్నారు. మేడారం జాతరకు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, రద్దీకి తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గద్దెల వద్ద కూడా పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వృద్ధులు, చిన్న పిల్లలు, ఆరోగ్యం సరిగా లేనివారు ట్రాఫిక్ లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది.

ట్రాఫిక్ లో భక్తుల నరకం

ప్రస్తుతం మేడారం నుండి పస్రా వరకు ట్రాఫిక్ రద్దీ కొనసాగుతోంది ఈ ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేసి పంపించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాఫిక్ లో చిక్కుకున్న భక్తులు మాత్రం నరకం చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+