Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జంపన్న వాగు వద్ద భక్తుల రద్దీ.. బాలింతల కోసం ఫీడింగ్ కేంద్రాలు ఏర్పాటు

మేడారం మహాజాతర ఈరోజు నుంచి 4 రోజుల పాటు జరగనుంది. రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే మేడారం మహాజాతరకు అంతా సిద్ధమైంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి మేడారం జాతరను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సమ్మక్క- సారలమ్మ వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర సర్కార్​ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగగా పేరొందిన మేడారం మహా జాతర ఈరోజు ప్రారంభం అయింది. నాలుగు రోజుల పాటు ఈ జాతర జరగనుంది. దాంతో ములుగు జిల్లాలోని అడవులన్నీ భక్తజనసంద్రంగా మారాయి. ఈ జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించడం. సారలమ్మ గద్దెపైకి వస్తున్న తరుణంలో వేలాది మంది భక్తులు జంపన్న వాగు వద్దకు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడుతోంది.

ఈ నేపథ్యంలో భక్తులు జాతర వెళ్లేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్‌ నగరం సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 4 వేల బస్సులు మేడారంకు బయల్దేరుతున్నాయి. ఇక గ్రేటర్‌ పరిధిలో దాదాపు 3200 బస్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో 900 వరకు మేడారం జాతర కోసం నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్​ నగరంలోని సాధారణ ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు.

medaram Maha Jatara 2026 Begins Today Asia s Largest Tribal Festival Kicks Off with Grandeur

మరోవైపు మేడారం జాతరకు వరంగల్ రీజినల్ ఆధ్వర్యంలో నేటి వరకు దాదాపు 1998 ట్రిప్పుల్లో 88, 686 మంది ప్రయాణికులను ఆర్టీసీ చేరవేసింది. ప్రధానంగా మేడారంలో 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంతో తాత్కాలిక ఆర్టీసీ బస్ స్టేషన్ ఏర్పాటుచేసి 9 కిలోమీటర్ల మేర 20వేల మంది నిలబడే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు అధికారులు. దాంతో పాటు దాదాపు 1000 బస్సులు పార్కింగ్ చేసే విధంగా 25.76 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. అలాగే మేడారం జాతరలో బాలింతల కోసం ఫీడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. పిల్లలకు పాలివ్వడానికి అన్ని రకాల సౌకర్యాలతో ఈ ఫీడింగ్ సెంటర్స్‌ ను నెలకొల్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+