మేడ్చల్ లో హల్చల్ చేస్తున్న మంత్రి మల్లారెడ్డి.. అక్కడ ట్రెండ్ ఇలా!!
మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి హల్చల్ చేస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన మల్లారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా హుషారుగా ఓటర్లను తన వాళ్లుగా దగ్గరికి తీసుకుంటూ మంత్రి మల్లారెడ్డి ప్రజలలో జోష్ నింపుతున్నారు. ఇక మంత్రి మల్లారెడ్డి ప్రచారం చేస్తున్న మేడ్చల్ నియోజకవర్గం విశేషాలు ఏమిటో? అక్కడ ట్రెండ్ ఏ విధంగా నడుస్తుందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హైదరాబాద్ నగరానికి శివారులో వున్న మేడ్చల్ నియోజకవర్గం జిల్లాల పునర్విభజనలో మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లా పరిధికి వెళ్ళింది. ప్రస్తుతం బోడుప్పల్, ఫిర్జాది గూడ, జవహర్ నగర్ కార్పొరేట్లు, నాగారం, ఘట్ కేసర్, మేడ్చెల్, గుండ్ల పోచంపల్లి, తూముకుంట, దమ్మాయిగూడ, పోచారం మున్సిపాలిటీలకు ఈ నియోజకవర్గం విస్తరించి వుంది.

6 లక్షల 37 వేల పైగా ఓటర్లతో రాష్ట్రంలోని రెండో అతి పెద్ద నియోజకవర్గమైన మేడ్చల్ లో అత్యధికంగా 17 వేల మందికి పైగా కొత్త ఓటర్లు వుండటం గమనార్హం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు వందేమాతరం రామచంద్రరావు లాంటి ప్రముఖులు గతంలో మేడ్చల్ నియోజక వర్గం నుంచే శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు.
పెద్ద సంఖ్యలో విద్యా సంస్థలు, పరిశోధన, ఇతర సంస్థలు వున్న మేడ్చల్ నియోజకవర్గం నుంచి మంత్రి చాముకూర మల్లారెడ్డి మరో సారి పోటీ పడుతున్నారు. BJP అభ్యర్ధి ఏనుగు సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి వజ్రేష్ యాదవ్ అధికార పక్షానికి గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రచారంలో మాత్రం మల్లారెడ్డి ముందు వరుసలో ఉన్నారు. మల్లారెడ్డి కి నియోజకవర్గంలో ఉన్న క్రేజ్ అలాంటిది.
ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అక్కడ బహిరంగ సభ నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ కేడర్ లో జోష్ నింపారు . ఆ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు నియోజకవర్గంలో రోడ్ షోలు నిర్వహించగా, తుది ప్రచారానికి ఆ పార్టీ సిద్ధమవుతోంది. కాగా, నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్టు, మరో సారి తనను ఎన్నుకోవాలని మల్లారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రచారం చేస్తున్నారు.

తనకు అవకాశం ఇస్తే మరోమారు మంత్రిని అవుతానని, నియోజకవర్గ ప్రజలకు అనుకున్నది చేస్తానని మంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో చెబుతున్నారు. BJP అభ్యర్ధి సుదర్శన్ రెడ్డి నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి వజ్రేష్ యాదవ్ కు మద్దతుగా ప్రదేశ్ కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే ఆరు గ్యారంటీల అమలు తధ్యం అని ప్రచారం చేస్తున్నారు.
బహుజన్ సమాజ్ పార్టీ తో పాటు, పలు ఇతర పార్టీల అభ్యర్ధులు, మరో పది మంది స్వతంత్రులు మొత్తం 22 మంది ఈ సారి బరిలో నిలవడంతో ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. ఏది ఏమైనా మంత్రి మల్లారెడ్డి మాత్రం అందరిని డామినేట్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications