నల్గొండ జిల్లాలో దారుణం : ఆస్పత్రి నిర్వాకానికి ఐసీయూలో 15 మంది చిన్నారులు !!
నల్గొండ జిల్లాలో వైద్యం వికటించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆస్పత్రి నిర్వాకానికి 15 మంది చిన్నారులు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై ఐసీయూలో చికిత్స పొందే పరిస్థితి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారగా .. సదరు హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలేం జరిగిందంటే..?
నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో ఉన్న కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రిలో వైద్యం వికటించింది. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న 15 మంది చిన్నారులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. కాగా ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే చిన్నారుల పరిస్థితి విషమంగా మారినట్టు చెబుతున్నారు. పిల్లలకు వాంతులు, విరోచనాలు, చలి, జ్వరం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించాయని తల్లిదండ్రులు వాపోయారు.

విషమించడంతో ఐసీయూకు తరలింపు..
అయితే చిన్నారుల పరిస్థితి విషమించడంతో ఆస్పత్రి సిబ్బంది వెంటనే 15 మంది చిన్నారులను ఐసీయూకు తరలించి అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం పిల్లల స్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించినప్పటికీ వారి ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువస్తే ఇలా జరగడం పట్ల ఆవేదన చెందుతున్నారు.
ఈ ఘటనపై చిన్నారుల తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంజెక్షన్ తప్పుగా ఇచ్చారని... డ్యూటీలో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడుతున్నారు. ఆస్పత్రి నిర్వహణపై చర్యలు తీసుకోవాలని పూర్తి స్థాయి విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
నల్గొండ జిల్లాలో దారుణం.. ఆస్పత్రి నిర్వాకానికి ఐసీయూలో 15 మంది చిన్నారులు..!!#Nalgonda #TelanganaNews #NewsUpdates #OIUpates #Oneindiatelugu pic.twitter.com/RTD4OBlpIQ
— oneindiatelugu (@oneindiatelugu) November 15, 2025
ఇక ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఆస్పత్రి పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న ఆరోగ్య శాఖ అధికారులు ఆస్పత్రికి చేరుకుని సిబ్బందిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పిల్లలకు ఇచ్చిన ఇంజెక్షన్‌లో సమస్య ఉందా? లేక ఇవ్వడంలో పొరపాటు జరిగిందా? వంటి విషయాలపై విచారణ జరుగుతోంది.












Click it and Unblock the Notifications