వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదో అంతస్థు నుంచి దూకి మెడికో ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

నల్గొండ: ఓ వైద్య విద్యార్థి భవనం ఐదో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వైద్యవిద్య కళాశాలలో చేరి కేవలం 10 రోజులు మాత్రమే గడిచింది. అంతలోనే అయిదంతస్తుల భవనం పైనుంచి దూకి ఉసురు తీసుకున్నాడు. తమ కుమారుడు ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకు సాధించి ఉస్మానియా వైద్య కళాశాలలో సీటు సాధించాడనే సంతోషం కుటుంబ సభ్యులకు ఆవిరైంది.

నల్గొండకు చెందిన ట్రస్మ నాయకులు యానాల ప్రభాకర్‌రెడ్డి కుమారుడు యానాల సాయికుమార్‌రెడ్డి(19) మంగళవారం అయిదంతస్తుల భవనంపై నుంచి దూకి అక్కడిక్కడే మరణించాడు. సాయి కుమార్‌రెడ్డి చిన్నప్పటి నుంచి చదువుల్లో రాణిస్తూ వస్తున్నాడు. నల్గొండలోని మమత ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు.

Medico commits suicide in Nalgonda district

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం హైదరాబాద్‌లోని శ్రీగాయత్రి కళాశాలలో, ద్వితీయ సంవత్సరం శ్రీచైతన్య కళాశాలలో అభ్యసించాడు.వైద్య వృత్తిలో స్థిరపడాలన్నది సాయికుమార్‌రెడ్డి లక్ష్యం.తల్లిదండ్రులు ప్రోత్సహించారు. మెడిసిన్‌ సీటు సాధించాలనే లక్ష్యంతో సాయికుమార్‌రెడ్డి మందుకు సాగుతూ వచ్చాడు.

2016-2017లో నిర్వహించిన టీఎస్‌ఎంసెట్‌1లో 484 ర్యాంకు, టీఎస్‌ఎంసెట్‌2లో 407 ర్యాంకు, టీఎస్‌ఎంసెట్‌3లో 167 ర్యాంకు సాధించాడు. ఏపీ ఎంసెట్‌ ప్రవేశపరీక్షలో 241 ర్యాంకు సాధించాడు. ఇలా ఒక్కో పరీక్షలో ర్యాంకును వృద్ధి చేసుకుంటూ విజయం సాధించాడు. టీఎస్‌ఎంసెట్‌లో 167 ర్యాంకు సాధించిన సాయికుమార్‌రెడ్డి ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌లో ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో సీటు వచ్చింది.

English summary
medico sai Kumar Reddy has committed suicide in Nalgonda district jumping from fifth floor of the building
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X