మెడికో ప్రీతి ఆరోగ్యం విషమంగానే; సుమోటోగా జాతీయ మానవ హక్కుల కమీషన్ కేసు, నోటీసులు!!
వరంగల్ పీజీ వైద్య విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సుమోటోగా జాతీయ మానవ హక్కుల కమీషన్ కేసు నమోదు చేసి ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో విధులలో ఉన్న సమయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కి నిమ్స్ లో చికిత్స కొనసాగుతోంది. ఇప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ప్రత్యేక వైద్య బృందం మెడికో ప్రీతికి అత్యాధునిక చికిత్సను అందిస్తోంది. మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వేళ ఆమె ఆరోగ్యం పై సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇక తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన నిమ్స్ వైద్యులు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు.

విషమంగానే ప్రీతి ఆరోగ్యం.. తాజా హెల్త్ బులెటిన్ ఇలా
ప్రస్తుతం మెడికో ప్రీతి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రీతికి ఎక్మో, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని, ప్రత్యేక బృందం ఆమెను బ్రతికించడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని నిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రీతికి డయాలసిస్ కొనసాగుతుందని, ఆమె శరీరం వైద్యానికి సహకరిస్తుందని పేర్కొన్నారు. ప్రీతి దగ్గరుండి మరీ డాక్టర్ల బృందం ఆమె హెల్త్ కండిషన్ పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఆమెను రక్షించాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు
ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనతో గవర్నర్ తమిళిసై, మంత్రి హరీష్ రావు, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావులు నిమ్స్ కు వెళ్లి వైద్యులను ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక పంపించాలని ఆదేశించింది.

దుమారంగా మారిన ప్రీతి ఆత్మహత్యా యత్నం కేసు
ఇదిలా ఉంటే మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసు రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో నిందితుడైన సైఫ్ పై చర్యలు తీసుకోవడంలో పోలీసులు టార్చర్ చేశారని, రాజకీయ ప్రమేయంతోనే పోలీసులు పట్టించుకోలేదని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే ప్రీతిని సైఫ్ వేధించడం ఉద్దేశపూర్వకంగా చేసిందేనని సైఫ్ ను అరెస్టు చేసిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు అతని సెల్ ఫోన్ లో ఉన్న వాట్సాప్ చాటింగ్ ఆధారంగా తేల్చారు. సైఫ్ ను కోర్టు ముందు హాజరు పరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ ను విధించింది. దీంతో సైఫ్ ను ఖమ్మం జైలుకు తరలించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications