మేడిగడ్డ బ్యారేజ్‌ కు కేంద్రం రెడ్‌ అలర్ట్‌.. ప్రమాదకరమైన డ్యామ్‌ గా గుర్తింపు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ బ్యారేజ్‌ కు కేంద్రం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. కేటగిరి-1 మాదకర డ్యామ్‌ గా మేడిగడ్డను గుర్తించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గుర్తించిన మూడు అత్యంత సమస్యాత్మక ప్రాజెక్టులలో మేడిగడ్డ ఒకటిగా నిలిచింది. గతేడాది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తీవ్ర లోపాలను గుర్తించింది. ఈ మేరకు మేడిగడ్డ బ్యారేజ్ లోపాలను పరిష్కరించకపోతే ప్రమాదమని హెచ్చరికలు జారీ చేసింది.

మేడిగడ్డ బ్యారేజ్‌కు కేంద్రం తాజాగా రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. కేటగిరి-1 ప్రమాదకర డ్యామ్‌ గా మేడిగడ్డ గుర్తించింది. గతేడాది వర్షాకాలంలో తనిఖీల్లో ప్రాజెక్టులో లోపాలు ఉన్నట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గుర్తించింది. ఈ క్రమంలో మేడిగడ్డ లోపాలు పరిష్కరించకపోతే ప్రమాదమని హెచ్చరికలు జారీ చేసింది. మేడిగడ్డ భద్రతపై తక్షణ చర్యలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు నివారణ చర్యలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు చేసింది. తాజాగా లోక్‌సభలో డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదికను విడుదల చేసిన నేపథ్యంలో ఈ అంశాలను పొందుపరిచింది.

దేశంలో డ్యామ్‌ ల భద్రతపై అడిగిన ప్రశ్నకు ఈమేరకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్రం ఈ విషయాన్ని పేర్కొంది. టీడీపీ ఎంపీలు లక్ష్మీనారాయణ, బైరెడ్డి శబరిలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి సమాధానం ఇచ్చారు. గతేడాది తనిఖీల్లో మేడిగడ్డ బ్యారేజ్‌ కు సంబంధించి పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. డ్యామ్ భద్రతకు సంబంధించిన కొన్ని లోపాలను గుర్తించినట్లు స్పష్టం చేశారు.

medigadda Barrage Red Alert Centre Declares Kaleshwaram Dam Dangerous High Risk to Lives

ఉత్తర్ ప్రదేశ్‌ లోని లోయర్ ఖజూరీ డ్యామ్ అలాగే జార్ఖండ్‌ లోని బొకారో బ్యారేజ్ లను కేంద్ర ప్రభుత్వం తన DRIP-II పథకం ద్వారా పునరావాస పనుల్లో చేర్చింది. అయితే మేడిగడ్డ విషయంలో మాత్రం తక్షణ రక్షణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యతను తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు తక్షణ చర్యలు అవసరమని కేంద్రం తన నివేదికలో స్పష్టం చేసింది. ఇక దేశవ్యాప్తంగా 50 సంవత్సరాలు పైబడిన డ్యామ్‌ లు 1,681 ఉన్నాయని, డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 ప్రకారం వీటిపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+