హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమ్ముడి వెంటే చిరంజీవి: హైదరాబాద్ వేదికగా - బీజేపీతో పెద్దలతో..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మొన్నటికి మొన్న ఆకాశానికెత్తేశారు మెగాస్టార్ చిరంజీవి. నిజాయితీగా ఉంటాడని, నిబద్ధతతో వ్యవహరిస్తాడని ప్రశంసించారు. పవన్ కల్యాణ్ వంటి నిబద్ధత ఉన్న నాయకుడు రాష్ట్రాన్ని ఏలాల్సిన అవసరం ఉందని, అలాంటి రోజు వస్తుందనీ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ మంచి నాయకుడవుతాడనీ ధీమా వ్యక్తం చేశారు. ఆయనకు తన పూర్తి మద్దతు ఉంటుందని మెగాస్టార్ భరోసా ఇచ్చారు.

తమవాడిగా..

తమవాడిగా..

ఈ వ్యాఖ్యాలు చేసిన రెండో రోజే- కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. చిరంజీవి-పవన్ కల్యాణ్ ఒకే వేదికపైకి రానున్నారు. ఒకే ఫ్రేమ్‌లో కనిపించనున్నారు. వారిద్దరే కాదు- జనసేన మిత్రపక్షం భారతీయ జనత పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు కూడా జత కలవనున్నారు. రాజకీయాలను తన నుంచి దూరం కాలేదంటూ కీలక వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్‌ను తమవాడిగా చేసుకోవడానికి బీజేపీ పావులు కదుపుతున్నట్టే కనిపిస్తోంది.

మెగాస్టార్ ఇంటికి..

మెగాస్టార్ ఇంటికి..


విజయదశమి తరువాతి రోజున ఏర్పాటు కాబోయే అలయ్ బలయ్ కార్యక్రమం దీనికి వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరు కాబోతోండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనను ఆహ్వానించడానికి- కేంద్ర మాజీమంత్రి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వయంగా మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. పవన్ కల్యాణ్ కూడా ఇందులో పాల్గొనబోతోన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌లో ఈ మధ్యాహ్నం నిర్వహించనున్నారు.

హాజరయ్యేది వీరే..

హాజరయ్యేది వీరే..

చిరంజీవిని సన్మానించాలనే ఉద్దేశంతోనే తాము ఈ కార్యక్రమానికి ఆయనను ముఖ్యఅతిథిగా ఆహ్వానించినట్లు దత్తాత్రేయ చెప్పారు. ఏపీ, తెలంగాణ, కేరళ గవర్నర్లు బిశ్వభూషణ్ హరిచందన్, తమిళిసై సౌందరరాజన్, ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, జీ కిషన్ రెడ్డి, భగవంత్ ఖుబా, భూపేంద్ర యాదవ్, హర్యానా, పంజాబ్ ముఖ్యమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, భగవత్ మాన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇందులో పాల్గొననున్నారు.

 రాజకీయాలకు అతీతంగా..

రాజకీయాలకు అతీతంగా..

రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ సారి మాత్రం దీనికి కాస్త రాజకీయ ప్రాధాన్యత ఏర్పడినట్టే కనిపిస్తోంది. వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతోండటం, ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టడం వంటి పరిస్థితుల మధ్య అలయ్ బలయ్ ఏర్పాటు కాబోతోండటం వల్ల అందరి దృష్టీ దాని మీదే ఉంది. బండారు దత్తాత్రేయ స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లడాన్ని కూడా రాజకీయ కోణంలోనే చూడాల్సి వస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

English summary
The Alai Balai programme is being hosted at Nampally exhibition ground in Hyderabad today. Mega Star Chiranjeevi and his brother, Jana Sena Party Chief Pawan Kalyan will participate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X