ఓటర్ల దెబ్బకు క్యూలో నిల్చొని ఓటు వేసిన చిరంజీవి
గతంలో ఎదురైన అనుభవంతో మెగాస్టార్ చిరంజీవి క్యూలో నిల్చొని ఓటు వేశారు. గత ఎన్నికల సమయంలో చిరంజీవి క్యూ నిల్చొకుండా నేరుగా ఓటు వేసే ప్రయత్నం చేశారు. అయితే క్యూలో ఉన్న ఓటరు ప్రశ్నించడంతో చిరంజీవి కంగుతిన్నారు. సెలబ్రిటీలు అయినంత మాత్రన నేరుగా ఓటు వేసే హక్కు రాజ్యంగం మీకు కల్పించిందా అంటూ చిరంజీవిని సదరు వ్యక్తి ప్రశ్నించారు.
ఊహించని పరిణామంతో కంగుతున్ని చిరంజీవి.. తన ఓటు ఈ బూతులో ఉందో లేదో తెలుసుకునేందుకు మాత్రమే లోపలికి వెళ్లానని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆ ఓటరు వెనక్కి తగ్గకపోవడంతో చేసేది లేక చిరంజీవి క్యూలో నిల్చొని ఓటు వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి.

గత అనుభవంతోనే చిరంజీవి ఈసారి క్యూలో నిల్చొని ఓటు హక్కు వేశారు. ఆయన పాటు భార్య సురేఖ, కూతురు శ్రీజ, కొడుకు రామ్ చరణ్ అందరూ క్యూలో నిల్చొని ఓటు తమ హక్కును వినియోగించుకున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. చెదురుమొదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక ఎప్పటిలాగే నగర ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications