మెగాస్టార్ కీలక ప్రకటన - అదే లక్ష్యం : ఎంతగానో బాధపడ్డాను - నా కోసం అభిమానులు దేనికైనా..!!

మెగాస్టార్ చిరంజీవి మనసు విప్పు మాట్లాడారు. తన సామాజిక సేవ వెనుక కళ్లారా చూసిన కష్టాలను వివరించారు. భవిష్యత్ లక్ష్యాలను స్పష్టం చేసారు. సామాజిక బాధ్యత గురించి చెప్పుకొచ్చారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కోసం ఇప్పటి వరకు 50 కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసిన వారికి జీవిత భీమా కార్డులను పంపిణీ చేసారు. తెలంగాణ గవర్నర్ తమిళసౌ వీటిని అందించారు. ఈ సమయంలో చిరంజీవి..తనకు అనేక సందర్భాల్లో గవర్నర్ అందించిన ప్రోత్సాహాన్ని వివరించారు.

చిరంజీవికి గవర్నర్ ప్రశంసలు

చిరంజీవికి గవర్నర్ ప్రశంసలు

చిరంజీవి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గవర్నర్ అభినందించారు. తాను హౌస్‌ సర్జన్‌గా పనిచేస్తున్న సమయంలో రోగులకు రక్తం ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాని రోజులు చూశానని గుర్తుచేసుకున్నారు. రక్తదానం చేయడం చిన్నవిషయం కాదని చెప్పారు.

రాజ్‌భవన్‌ తరఫునా రక్తదాన కార్యక్రమాలు చేపడుతున్నామని.. అవసరమైన వారికి సమయానికి రక్తం అందించేందుకు ఓ యాప్‌ను రూపొందించామని చెప్పుకొచ్చారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్తు కూడా సహకారం అందించేందుకు ఇందులో భాగస్వాములు కావాలని గవర్నర్ కోరారు. చిరంజీవి తాను బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు వెనుక కష్టాలను గుర్తు చేసుకున్నారు.

ఆ సమయంలో బ్లడ్ బ్యాంక్ ప్రారంభించా

ఆ సమయంలో బ్లడ్ బ్యాంక్ ప్రారంభించా

1998లో రక్తం అందుబాటులో లేక చాలామంది చనిపోయారని..ఆ ఘటనలు తనను ఎంతగానో బాధించిందని గుర్తు చేసుకున్నారు. దాదాపు 2 నుంచి 3 వేల మంది రక్తదానం చేస్తున్నారని మెగాస్టార్ వివరించారు. అలాంటి వారికి భద్రత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా చెప్పారు.

చిరుభద్రత పేరుతో కార్యక్రమం చేపట్టామన్నారు. 70శాతం రక్తం పేదలకు ఉచితంగా అందించామని చిరంజీవి ప్రకటించారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రక్తం దొరకడం లేదన్న సమస్య తక్కువగా ఉందని వివరించారు. అభిమానుల ప్రేమ మరి ఎందరికో మేలు చేయాలనే ఉద్దేశంతోనే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను ఏర్పాటు చేసామని చిరంజీవి వెల్లడించారు.

తన లక్ష్యం ఇదేనంటూ..

తన లక్ష్యం ఇదేనంటూ..

తాను త్వరలోనే ఆస్పత్రి కట్టనున్నట్లు చిరంజీవి కీలక ప్రకటన చేసారు. బ్లడ్ బ్యాంక్.. కరోనా సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా సేవలు అందించారు. అదే విధంగా ఆపదలో ఉన్న అభిమానుల కోసం స్వయంగా వారికి కార్పోరేట్ ఆస్పత్రుల్లో చికిత్సను సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నారు. తమ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు 9.30 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించామని చెప్పారు.

ఇందులో 70 శాతం పేదలకు ఇవ్వగా, మిగిలినది ప్రయివేటు ఆస్పత్రులకు అందించామని చిరంజీవి వివరించారు. ఇక, చిరంజీవి ఆస్పత్రి నిర్మించనున్నట్లు ప్రకటించటం ద్వారా సేవా కార్యక్రమాల్లో ఇదో మరింత మందికి మేలు చేసే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+