మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం, చేతబడి అనుమానంతో చితకొట్టారు

హైదరాబాద్: మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు ఇద్దరు యువకులు. ఈ దారుణ సంఘటన మెదక్ జిల్లాలోని సిద్దిపేట మండలం తోర్నాలలో చోటు చేసుకుంది. మతిస్ధిమితం లేని బాలిక ఇంట్లో ఒంటరిగా ఉ్న సమయంలో ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది.

బాధితురాలు ఆ ఇద్దరు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తికి గ్రామస్తులు దేహశుద్ది

చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తికి గ్రామస్తులు దేహశుద్ది చేశారు. ఈ సంఘటన మంగళవారం నల్లగొండ జిల్లా కనగల్ మండలం కురంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వీరయ్య అనే వ్యక్తి చేతబడి చేస్తున్నాడని గ్రామస్తులు గత కొంతకాలంగా అనుమానిస్తున్నారు.

Mentally girl gangraped by youth in medak

దీంతో గ్రామస్తులు అతనిపై మంగళవారం దాడి చేశారు. ఈ దాడిని వీరయ్య సోదరుడు పెద వెంకటయ్యతోపాటు అతడి బావమరిది చంద్రయ్య అడ్డుకున్నారు. ఈ దాడిలో వారిద్దరు కూడా గాయపడ్డారు. ఈ దాడిలో వీరయ్య తీవ్రంగా గాయపడటంతో అతడి కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం అతడిని నల్గొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

నాయిని చేతుల మీదగా పోలీస్ స్టేషన్ ప్రారంభం

ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్‌ను రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్నలతోపాటు ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+