వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమ్మల్ని తెలంగాణాలో కలపండి; మహారాష్ట్ర సర్కార్ కు 14 గ్రామాల ప్రజల షాక్!!

|
Google Oneindia TeluguNews

ఒక పక్క తెలంగాణ సీఎం కెసిఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. వివిధ రాష్ట్రాలలో పార్టీ కార్యకలాపాలను విస్తరించడానికి రెడీ అయ్యారు. ఇక ఇదే సమయంలో అనేక ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. మహారాష్ట్రలోని 14 గ్రామాలకు చెందిన ప్రజలు తమ తెలంగాణలో కలపాలని కోరుతున్నారు.

తెలంగాణాలో కలపాలంటున్న మహారాష్ట్ర 14 సరిహద్దు గ్రామాల ప్రజలు

తెలంగాణాలో కలపాలంటున్న మహారాష్ట్ర 14 సరిహద్దు గ్రామాల ప్రజలు

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులవుతున్న మహారాష్ట్ర గ్రామాల ప్రజలు తాము కూడా వాటి నుండి లబ్ది పొందాలని భావిస్తున్నారు. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు తమకు మహారాష్ట్ర వద్దు, తెలంగాణ రాష్ట్రం ముద్దు అంటూ తెలంగాణ రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహరాజ్‌గూడ, నాకే వాడ సహా 14 గ్రామాల గ్రామస్థులు మహారాష్ట్రలో సరిహద్దు ప్రాంతాలలో సమస్యలు ఉధృతం కావడంతో తెలంగాణలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

తెలంగాణాలో కలపటానికి ఆయా గ్రామాల ప్రజల మొగ్గు.. ఎందుకంటే

మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామాల ప్రజలు అటు మహారాష్ట్ర సర్కార్ అందించే సంక్షేమ పథకాలకు నోచుకోవడంలేదు. మహారాష్ట్ర నుంచి విసిరేసినట్టుగా ఉన్న ఈ సరిహద్దు గ్రామాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం, తాము సంతోషంగా జీవించడం కోసం తెలంగాణాలో కలపాలని కోరుకుంటున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం నుండి అనేక ప్రయోజనాలు ఉంటాయని భావించి వారు తెలంగాణ రాష్ట్రంలో తమ గ్రామాలను కలపాలని కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సరిహద్దు గ్రామాల ప్రజలకు వృద్ధులకు వెయ్యి రూపాయల పింఛన్, 10 కిలోల రేషన్ బియ్యం తో పాటు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. ఈ క్రమంలోనే వారు తమ గ్రామాలను తెలంగాణలో కలపడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మహారాష్ట్ర ప్రజాప్రతినిధుల వాదన ఇలా

మహారాష్ట్ర ప్రజాప్రతినిధుల వాదన ఇలా

గతంలోనూ తెలంగాణ రాష్ట్రంలో తమను కలపాలని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే . ఇప్పుడు మరోమారు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల వారు తెలంగాణ లో కలపాలని చేస్తున్న విజ్ఞప్తి హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై మహారాష్ట్ర ప్రజా ప్రతినిధులు మాత్రం భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. అక్కడి ప్రజలు 80 శాతం మంది మహారాష్ట్రలోనే ఉండాలని కోరుకుంటున్నారని రాజురా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సుభాష్ ధోటే చెబుతున్నారు. చాలా తక్కువ శాతం మంది తెలంగాణ రాష్ట్రంలో కలపాలని కోరుతున్నారని అంటున్నారు.

తెలంగాణాపై సరిహద్దు రాష్ట్రాల ప్రజల ఫోకస్

తెలంగాణాపై సరిహద్దు రాష్ట్రాల ప్రజల ఫోకస్


అయితే మహారాష్ట్ర కంటే తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్న అభివృద్ధి, అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలు, విప్లవాత్మక సంస్కరణలు వెరసి చాలామంది తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నట్టు దీనిపైన చర్చ జరుగుతుంది. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలే కాకుండా, ఏపీ విలీన గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన పరిస్థితి కూడా తెలంగాణపై ప్రస్తుతం సరిహద్దు రాష్ట్రాల ప్రజల ఫోకస్ ఎక్కువగా ఉందని అర్థమవుతుంది. ఏది ఏమైనా మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కలపాలని కోరుకోవడం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక షాక్ అనే చెప్పాలి.

English summary
14 villages people are giving a shock to the Maharashtra government by asking them to join us in Telangana. Being attracted to the development and welfare schemes in Telangana, they are expressing their willingness to be included in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X